Sakshi education logo
Search Bar

టెన్త్ లో మార్కుల కేటాయింపు ఇలా...: సీబీఎస్‌ఈ

Join our Community

facebook Twitter Youtube
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విద్యార్థులకు మార్కుల కేటాయింపు విధానాన్ని శనివారం ప్రకటించింది.
Education Newsప్రతి సబ్జెక్టులోనూ ఎప్పటిలాగే 20 శాతం మార్కులను ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా కేటాయిస్తారు. మిగిలిన 80 శాతం మార్కులను ఆయా పాఠశాలలు సంవత్సరం పొడవునా నిర్వహించిన పలు పరీక్షల్లో విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా కేటాయించాలని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ ప్రక్రియ నిమిత్తం ప్రతి పాఠశాల ప్రిన్సిపల్‌ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కమిటీని వేయాలని పేర్కొంది. గతంలో బోర్డు పరీక్షల్లో ఆయా పాఠశాలలు కనబర్చిన ప్రతిభకు అనుగుణంగానే ప్రస్తుత మార్కుల కేటాయింపు ఉండాలని, ఇష్టారాజ్యంగా మార్కులిస్తే అనుబంధ గుర్తింపు రద్దు, జరిమానాలు ఉంటాయని సీబీఎస్‌ఈ హెచ్చరించింది. జూన్‌ 20వ తేదీకల్లా ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది.
Published on 5/3/2021 1:57:00 PM

సంబంధిత అంశాలు