Advertisement

పోస్టులు రెండు.. ప్రిపరేషన్ ఒక్కటే


ఎన్‌ఐఏసీఎల్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్స్ ప్రిపరేషన్ ప్రణాళిక
మారుతున్న జీవన విధానం, పెరుగుతోన్న సాంకేతికత వల్ల వ్యక్తులు - సంస్థలు, ఇల్లు - పొలం, అందం - ఆరోగ్యం, కారు - బైకు, మొబైల్ - కంప్యూటర్, ఫర్నీచర్ - బంగారం.. ఇలా కాదేది బీమాకనర్హం అని నిరూపిస్తున్నాయి బీమా కంపెనీలు. ఒకప్పుడు కేవలం వ్యక్తులకే పరిమితమైన బీమా ఇప్పడు ఆరోగ్యంతో పాటు వందల సంఖ్యల్లో వస్తువులకు విస్తరించింది. గాయకులు గొంతుకు, డ్యాన్సర్లు కాళ్లకు వధూవరులు పెళ్లికి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారంటే బీమా ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో విస్తరణ బాట పట్టిన ఇన్సూరెన్స్ సంస్థలు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, చొరవ, సహనం గల యువతకు అద్భుత అవకాశం కల్పిస్తున్నాయి. అసిస్టెంట్‌లు మొదలుకొని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లు, సీనియర్ మేనేజర్‌లు, బోర్డు మెంబర్‌ల వరకు పలు రకాల ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకుంటున్నాయి. గతేడాది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో 2600 అసిస్టెంట్స్, 1434 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇండియా అస్యూరెన్స్ మరో భారీ నోటిఫికేషన్‌తో నిరుద్యోగుల ముంగిట వాలింది. 509 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 1536 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షలు రెండు అయినప్పటికీ ప్రిపరేషన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కేవలం ప్రశ్నల కఠిన స్థాయిలో తేడా ఉంటుంది. ఈ తరుణంలో రెండు పరీక్ష లను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ ఎలా సాగించాలో చూద్దాం.

ఖాళీల వివరాలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్

ఫైనాన్స్

65

ఇంజనీరింగ్

25

లీగల్

40

ఆటోమొబైల్ ఇంజనీరింగ్

30

జనరలిస్ట్

349

మొత్తం

509అసిస్టెంట్స్

1536

ఆంధ్రప్రదేశ్

38

తెలంగాణ

55విద్యార్హతలు:
జనరలిస్ట్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ (సీఏ, బీటెక్, బీఈ, బీఎల్)
అసిస్టెంట్స్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత

వయోపరిమితి:
ఆఫీసర్స్:
1, అక్టోబర్ 2014 నాటికి కనీస వయసు 21 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ వారికి ఆయా కేటగిరీల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అసిస్టెంట్స్: 30, జూన్ 2014 నాటికి కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్టం 30 సంవత్సరాలు
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ వారికి ఆయా కేటగిరీల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుం:
ఆఫీసర్లు:
జనరల్ అభ్యర్థులు రూ.600/-
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 50/-

అసిస్టెంట్స్:
జనరల్ అభ్యర్థులు రూ.500/-
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 50/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ముందుగా https://newindia.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి "Administrative Officers', / Assistants" నియామకానికి ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత ‘Apply Online’ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన పేజీలో ‘Click here for new registration‘ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అనంతరం వచ్చిన దరఖాస్తులో పూర్తి వివరాలు నింపిన తర్వాత నిబంధనలకనుగుణంగా ఫోటో, సంతకం అపలోడ్ చేసి సబ్‌మిట్ కొట్టాలి. ఆన్‌లైన్‌లో జనరేట్ అయ్యే రిఫరెన్‌‌స ఐడీని నోట్ చేసుకోవాలి.

ఫీజు చెల్లింపు: దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే ఫీజు చెల్లింపు పేజీలో క్రెడిట్ / డెబిట్ కార్డు లేదా, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆఫీసర్లు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:
11 అక్టోబర్, 2014
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 03 నవంబర్, 2014
ఫీజు చెల్లింపు చివరి తేది: 03 నవంబర్, 2014
రాతపరీక్ష తేది: 10, 11 జనవరి 2015
వెబ్‌సైట్ : https://newindia.co.in/index.aspx
Apply online: https://ibps.sifyitest.com/niaaossep14/
అసిస్టెంట్స్:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:
18 అక్టోబర్, 2014
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 10 నవంబర్, 2014
ఫీజు చెల్లింపు: 18 అక్టోబర్ నుంచి 10 నవంబర్, 2014
రాతపరీక్ష తేది: 17, 18, 24 జనవరి 2015
వెబ్‌సైట్ : https://newindia.co.in/index.aspx
 
రాత పరీక్షా విధానం:
జనరలిస్ట్ ఆఫీసర్‌లు

పరీక్ష

మార్కులు

టెస్ట్ ఆఫ్ రీజనింగ్

50

టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్

50

టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్

50

టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

50

మొత్తం

200స్పెషలిస్ట్ ఆఫీసర్‌లు

పరీక్ష

మార్కులు

టెస్ట్ ఆఫ్ రీజనింగ్

40

టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్

40

టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్

40

టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

40

ప్రొఫెషనల్ సబ్జెక్టు

40

మొత్తం

200అసిస్టెంట్స్

పరీక్ష

మార్కులు

టెస్ట్ ఆఫ్ రీజనింగ్

50

టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్

50

టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్

50

టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ

50

కంప్యూటర్ నాలెడ్‌‌జ

50

మొత్తం

250

నోట్:
 1. పరీక్షలో మొత్తం మార్కులను 35 కి త గ్గిస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. రెండు కలిపి 50 మార్కులుగా పరిగణించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
2. పై మూడు పరీక్షలకు సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 చొప్పున కోత విధిస్తారు.

సిద్ధమవ్వండిలా..
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ : అభ్యర్థి తార్కిక ఆలోచన శక్తిని, విశ్లేషణా శక్తిని పరిశీలించేలా ఈ విభాగంలో ప్రశ్నలడుగుతారు. అనాలజీ (నంబర్, ఫిగర్, ఆల్ఫాబెట్)నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, పజిల్ టెస్ట్స్, ఇన్‌పుట్ అవుట్‌పుట్(సిల్లోజం), క్లాసిఫికేషన్, కోడెడ్ ఇనిక్వాలిటీస్, నాన్ వర్బల్ రీజనింగ్ మొదలైన వాటి నుంచి ప్రశ్నలెదురవుతాయి. సంబంధిత ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలన, కఠిన సాధనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ / న్యూమరికల్ ఎబిలిటీ: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో నంబర్ సిస్టమ్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, శాతాలు, స్క్వేర్ రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, భాగస్వామ్య వ్యాపారం మొదలైన అంశాలపై ప్రశ్నలడుగుతారు. గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్‌ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ పుస్తకాలను సాధన చేయాలి. దీంతో పాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. ప్రతి చాప్టర్‌ను ప్రాక్టీస్ చేయడంతోపాటు వీలైనన్ని మాక్ టెస్ట్‌లను సాధన చేయాలి. సంబంధిత అంశాలలో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి.

జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్: జీకేలో అత్యధిక మార్కుల కోసం 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు ఏవైనా తెలుగు దినపత్రికలను, ఏదైనా ఒక ఇయర్‌ బుక్‌ చదవాలి. ఈ విభాగంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, వివిధ జాతీయ ఉద్యమాలు, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్స్, వ్యక్తులు-బిరుదులు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు-వ్యక్తులు, క్రీడలు, వ్యక్తులు-నియామకాలు, వివిధ సదస్సులు జరిగిన ప్రాంతాలు, శాస్త్రసాంకేతిక ప్రయోగాలు మొదలైనవాటి నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంది. పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇన్సూరెన్‌‌స రంగానికి చెందిన ఉద్యోగం కాబట్టి ఇన్సూరెన్స్ లో వస్తున్న తాజా మార్పులు, పదజాలాలు, ఐఆర్‌డీఏ తాజా విధానాలు, రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు, బడ్జెట్ వంటి విషయాలపై కూడా దృష్టి సారించాలి.

టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగంలో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రిపొజిషన్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్, స్పీచెస్, సింగులర్ అండ్ ప్లూరల్, టెన్సెస్, ఆంటోనిమ్స్, సిననిమ్స్ ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. రోజూ 10 కొత్త పదాలు నేర్చుకొని వాటిని వాక్యాలలో ఉపయోగించడం సాధన చేయాలి. ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం లేదా ప్రముఖ ఛానల్‌లో వచ్చే గ్రూప్ డిస్కషన్లను వినడం ఎంతో లాభిస్తుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలలో ఉన్న వ్యాకరణాన్ని సాధన చేస్తే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు.

కంప్యూటర్ లిటరసీ: అభ్యర్థి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. కంప్యూటర్‌ల చరిత్ర, జనరేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌లు, షార్ట్కట్స్, పదజాలాలు, అబ్రివేషన్స్, ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్, ఈమెయిల్స్, వంటి దినచర్యలో భాగమైన కంప్యూటర్ అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్‌పై ప్రాక్టికల్‌గా చదివితే సులభంగా గుర్తుంచుకోవచ్చు. సాక్షి రూపొందించిన కంప్యూటర్ బిట్ బ్యాంక్‌ను సాధన చేయడం వల్ల ఈ విభాగంలో 90-100 శాతం మార్కులు సాధించవచ్చు.

రిఫరెన్స్ బుక్స్:
జనరల్ అవేర్‌నెస్: ఏదైనా జనరల్ నాలెడ్జ పుస్తకం, మలయాళ మనోరమ ఇయర్‌బుక్, ప్రతియోగితా కిరణ్ మంత్లీ మ్యాగజైన్, ఇతర దినపత్రికలు, సాక్షి జనరల్ నాలెడ్జ్ పోర్టల్
రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్, న్యూమరికల్ ఎబిలిటీ-ఎస్ చంద్ పబ్లికేషన్స్, క్వికర్ మ్యాథ్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్ పబ్లికేషన్స్
జనరల్ ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం, టాటా మెక్‌గ్రాహిల్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ బుక్, వివిధ బిజినెస్ దినపత్రికలు, కిరణ్ ప్రకాశన్ మోడల్ పేపర్స్
కంప్యూటర్ నాలెడ్జ్: సాక్షి రూపొందించిన మెటీరియల్, బిట్‌బ్యాంక్, ఏదైనాప్రామాణిక పుస్తకం

విజయోస్తు!
www.sakshieducation.com
Published on 10/21/2014 2:36:00 PM

Related Topics