Sakshi education logo
Sakshi education logo

సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌కు 76వ స్థానం

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే ‘సోషల్ మొబిలిటీ సూచీ 2020’లో భారత్‌కు 76వ స్థానం దక్కింది.
Current Affairs  వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 82 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో డెన్మార్క్ అగ్రస్థానం నిలిచింది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు.

సోషల్ మొబిలిటీ విషయంలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.

సోషల్ మొబిలిటీ సూచీ 2020

ర్యాంకు

దేశం

1 డెన్మార్క్
2 నార్వే
3 ఫిన్‌లాండ్
4 స్వీడెన్
5 ఐస్‌లాండ్
27 అమెరికా
45 చైనా
59 }లంక
76 భారత్
77 దక్షిణాఫ్రికా
78 బంగ్లాదేశ్
79 పాకిస్థాన్
80 కామెరూన్
81 సెనెగల్
82 కోట్ డి ఐవోరీ

క్విక్ రివ్యూ :

 ఏమిటి : సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌కు 76వ స్థానం
 ఎప్పుడు : జనవరి 20
 ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)
 ఎక్కడ : ప్రపంచంలో

మాదిరి ప్రశ్నలు

1. డబ్ల్యూఈఎఫ్ సోషల్ మొబిలిటీ సూచీ 2020లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
 1. నార్వే
 2. డెన్మార్క్
 3. స్వీడెన్ 
 4. ఫిన్‌లాండ్ 

Published on 1/21/2020 6:18:00 PM

సంబంధిత అంశాలు