ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21


Edu newsఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21అన్ని రంగాల సమగ్రాభివృద్ధి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాల ద్వారా రాష్ట్రంలో నవశకం ఆవిష్కరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,24,789.18 కోట్లతో రూపొందించిన రాష్ట్ర బడ్జెట్‌ను జూన్ 16న ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా కోవిడ్ -19 వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మన ముఖ్యమంత్రి సమర్థవంతమైన నాయకత్వం వల్ల మన ప్రభుత్వం ఈ పోరాటంలో ముందుందని బుగ్గన అన్నారు. మరోవైపు శాసనమండలిలో డిప్యూటీ సీఎం, శాసనమండలి పక్ష నాయకుడు, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు.

రాష్ట్ర బడ్జెట్ 2020-21 (రూ. కోట్లలో)
బడ్జెట్ 2,24,789.18
రెవెన్యూ వ్యయం 1,80,392.64
మూలధన వ్యయం 44,396.54
రెవెన్యూ ఆదాయం 1,61,958.50
కేంద్ర పన్నుల్లో వాటా 32,237.68
కేంద్ర గ్రాంట్లు 53,175.41
రెవెన్యూ లోటు 18,434.14
ద్రవ్య లోటు 48,295.58

వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ మొత్తం: రూ.29,159.97 కోట్లు
రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి రూ.6,885.60 కోట్లు కేటాయింపు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కేటాయింపు

ఆర్థిక సామాజిక, సాధారణ సేవలకు కేటాయింపులు
1. ఆర్థిక సేవలకు రంగాల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
వ్యవసాయ అనుబంధ సర్వీసులకు 13,617.55
గ్రామీణాభివృద్ధి 15,112.75
జలవనరులు, వరద నియంత్రణ 11,805.74
ఇంధనం 6,984.72
పరిశ్రమలు, మినరల్స్ 2,705.14
రవాణా 7,231.27
శాస్త్ర సాంకేతిక, పర్యావరణం 10.74
సాధారణ ఎకో సర్వీసెస్ 4,094.27
మొత్తం 61,562.18
2. సామాజిక సేవల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
సాధారణ విద్య 25,201.35
క్రీడలు, యువజన సర్వీసులు 150.81
సాంకేతిక విద్య 348.32
ఆర్ట్ అండ్ కల్చర్ 24
వైద్యం 11,419.48
తాగునీరు, పారిశుధ్యం 1,644.05
గృహ నిర్మాణం 3,691.79
పట్టణాభివృద్ధి 8,150.24
సమాచార శాఖ 265.91
సంక్షేమం 41,456.30
కార్మిక, ఉపాధి 830.62
సామాజిక భద్రత, సంక్షేమం 3,479.65
మొత్తం 96,662.52
3. సాధారణ సేవలు రూ.66,564.48 కోట్లు
మొత్తం రూ.2,24,789.18 కోట్లు

2020-21 ఏడాదిలో రాక, పోక...
Budget 18-19

రంగాల వారీగా పన్నులు, పన్నేతర ఆదాయం
 • కేంద్ర పన్నుల్లో వాటా రూ. 32,237.68 కోట్లు
 • పన్నేతర ఆదాయం రూ. 5,866.06 కోట్లు
 • పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ. 70,679.93 కోట్లు
 • గ్రాంట్లు రూపంలో వచ్చే ఆదాయం రూ. 53,175.41 కోట్లు
 • మొత్తం ఆదాయం రూ.1,61,959.08 కోట్లు

రాష్ట్ర అప్పు రూ.3,48,998 కోట్లు
2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,48,998.11 కోట్లకు చేరతాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌లో అంచనా వేశారు. ఈ మొత్తం అప్పులో రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ కాని అప్పు రూ.21,303 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి అప్పుల పెరుగుదల, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం ఇలా ఉంది.

ఆర్థిక ఏడాది మొత్తం అప్పు (రూ.కోట్లలో) రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో%
ఆర్థిక ఏడాది మొత్తం అప్పు (రూ.కోట్లలో) రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో%
2016-17 1,94,862.15 27.87
2017-18 2,23,705.95 27.83
2018-19 2,57,509.87 28.02
2019-20 (స. అ) 3,02,202.70 27.97
2020-21 (మా. అ) 3,48,998.11 34.55
- స: సవరించిన అంచనాలు మా: మార్చినాటికి అంచనా

వివిధ శాఖలు, రంగాలకు కేటాయింపులు
సంక్షేమ రంగానికి భారీగా నిధులు
సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటారుుంచి పేదలకు అండగా ఉన్నామనే భరోసాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 2020-21 బడ్జెట్‌లో గత సంవత్సరం కంటే కేటారుుంపులు పెరిగారుు. అలాగే లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది.

బీసీ సంక్షేమం
బీసీల సంక్షేమానికి 2020-21 బడ్జెట్‌లో కాంపోనెంట్ ద్వారా రూ.25,331.30 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం రూ.15,061.64 కోట్లు కేటాయించారు. అంటే ఈ సంవత్సరం 68.18 శాతం ఎక్కువ బడ్జెట్ కేటారుుంపు జరిగింది. నవరత్నాల ద్వారా రూ. 23,458.8 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఎస్సీ సంక్షేమం
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం 2020-21 బడ్జెట్‌లో రూ.15,735.68 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం బడ్జెట్ కంటే 4.90 శాతం ఎక్కువ. గత ఏడాది రూ.15,000.85 కోట్లు కేటాయించారు. 47 ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వివిధ పథకాల కోసం ఖర్చు చేస్తారు. నవరత్నాల అమలుకు రూ.7,525.02 కోట్లు ఖర్చు చేస్తారు.

ఎస్టీల సంక్షేమం
గిరిజనుల సంక్షేమానికి 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 5,177.53 కోట్లు కేటాయించింది. 2019-20 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 3.79 శాతం ఎక్కువ. నవరత్న పథకాల అమలుకు రూ.1,840.71 కోట్లు ఖర్చు చేయనున్నారు.

మైనార్టీల సంక్షేమం
రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,050.22 కోట్లు కేటాయించింది. 2019-20 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 116.10 శాతం ఎక్కువ. మైనార్టీలకు నవరత్నాల అమలుకు ఈ ఏడాది రూ.1998.56 కోట్లు ఖర్చు చేయనున్నారు.

కాపు కార్పొరేషన్‌కు రూ.2845.60 కోట్లు
కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో గత ఏడాది కంటే రూ.830.95 కోట్లను అధికంగా కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.2845.60 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.2014.65 కోట్లు కేటాయించింది.

సంక్షేమ రంగం కేటాయింపులు(రూ. కోట్లలో)
వైఎస్సార్ పెన్షన్ కానుక 16,000
వైఎస్సార్ ఆసరా 6,300
అమ్మ ఒడి 6,000
జగనన్న విద్యా దీవెన 3,009
వైఎస్సార్ జగనన్న చేదోడు 247.04
వైఎస్సార్ మత్స్యకార భరోసా 109.75
జగనన్న తోడు 100
వైఎస్సార్ చేయూత 3,000
జగనన్న వసతి దీవెన 2,000
వైఎస్సార్ కాపు నేస్తం 350
వైఎస్సార్ వాహన మిత్ర 275.51
వైఎస్సార్ లా నేస్తం 12.75
ఇమాములు, మౌజన్లు ప్రోత్సాహకాలు 50
gెరూసలేం సందర్శన 5.0
వైఎస్సార్ నేతన్న నేస్తం 196
వైద్య ఆరోగ్యరంగం 11,419.47
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన          5,009
ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం 6,190.33


రోడ్లు, రవాణా అభివృద్ధికి 6,588.58 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, రవాణా అభివృద్ధికి 2020-21 ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఆర్‌అండ్‌బీ, రవాణా రంగాలకు రూ. 6,588.58 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ (2019-20)లో రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 6,202.98 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో 6.22 శాతం అధికంగా నిధులిచ్చారు.

విద్యా శాఖకు రూ.25,737.62 కోట్లు Budget 18-19
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో విద్యా శాఖకు రూ.25,737.62 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు 22,604.01 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,276.97 కోట్లు కేటాయించారు.

విద్యారంగం కేటాయింపులు(రూ. కోట్లలో)
నాడు నేడు 3,000
టీచింగ్ గ్రాంట్స్ 13,124.37
ఉన్నత విద్య 2276.97
సమగ్ర శిక్ష 1,937.02
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ ఇన్‌స్టిట్యూషన్‌‌స            1,633.65
జగనన్న గోరు ముద్ద 974.86
సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి 856.64
జగనన్న విద్యా కానుక 500
ప్రభుత్వ జూ.కాలేజీలు 493.84
మాధ్యమిక శిక్ష అభియాన్ 242.50
ఇంగ్లిష్ మీడియం 55.15
ప్రతిభా స్కాలర్‌షిప్స్ 10.54

యూనివర్సిటీలకు నిధుల వరద
 • ప్రభుత్వం ప్రతి వర్సిటీ న్యాక్ గ్రేడ్,, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) వంటివి సాధించి ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో రెవెన్యూ గ్రాంటుతోపాటు కేపిటల్ గ్రాంట్‌ను కూడా కేటాయించింది.
 • అరకులో వైఎస్సార్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది.
 • కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్‌‌ట్స యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీల ఏర్పాటుకు వీలుగా కేటాయింపులు చేసింది.
 • ఇవే కాకుండా కొత్తగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ అనే సంస్థకు కూడా రూపకల్పన చేసి నిధుల కేటాయింపులు జరిపింది.
 • ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంక్చ్ఠులను సాధించేందుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కేపిటల్ గ్రాంట్‌ను కేటారుుంచింది.
వర్సిటీలు, సంస్థలకు కేటాయింపులు (రూ.కోట్లలో)..
యూనివర్సిటీ రెవెన్యూ గ్రాంట్ కేపిటల్ గ్రాంట్
విక్రమసింహపురి 15.97 10
కృష్ణా 5.94 -
యోగి వేమన 32.87 20
పద్మావతి 53.24 10
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్‌‌ట్స 5 45
శ్రీకృష్ణదేవరాయ 54.93 5
శ్రీ వేంకటేశ్వర 164.99 -
ఆదికవి నన్నయ 11.98 10
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ      4.22 -
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 4.51 -
ఆంధ్రా యూనివర్సిటీ 261.57 -
ద్రవిడియన్ 19.93 12.30
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం      00.50 -
రాయలసీమ 10.32 20
ఆచార్య నాగార్జున 54.98 -
అంబేడ్కర్ 12.58 20
ఉర్దూ 2.29 -
జేఎన్‌టీయూ కాకినాడ 41.96 -
జేఎన్‌టీయూ అనంతపురం 66.76 -
ఆర్జీయూకేటీ 47.27 100
వైఎస్సార్ ట్రైబల్ -- 50

వైద్య, ఆరోగ్య రంగానికి రూ.11,419.47 కోట్లు Budget 18-19
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య రంగానికి సర్కార్ 2020-21బడ్జెట్‌లో ఏకంగా రూ.11,419.47 కోట్లు కేటారుుంచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య శాఖకు 54 శాతం అధికంగా నిధులు కేటాయించారు. 1.42 కోట్ల కుటుంబాలకు అపర సంజీవనిగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు కేటారుుంచారు.

వైద్య, ఆరోగ్యంలో కేటాయింపులు(రూ. కోట్లలో)
డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 2,100
జాతీయ ఆరోగ్యమిషన్ 1808.03
నాడు-నేడు పనులు 1,528
వైద్య కళాశాలలు 1,122.66
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 743.24
వైద్యవిధాన పరిషత్ 710
మందుల కొనుగోలు 400
108 సర్వీసులు 266.17
104 సర్వీసుల నిర్వహణ 204.12
ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ 242.51
ఆశా వర్కర్ల వేతనం.. ఇతర పథకాల నిర్వహణ 2,294.74

పారిశ్రామిక రంగానికి రూ.4,455 కోట్లు
2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.4,455 కోట్లు కేటారుుంచారు. ఇందులో రూ.1,826.04 కోట్లు పారిశ్రామిక రారుుతీలు, పరిశ్రమల ప్రోత్సాహకానికి కేటారుుంచారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రూ.856.64 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

పారిశ్రామిక రంగం కేటాయింపులు(రూ. కోట్లలో)
పారిశ్రామిక రారుుతీలు 1,826.04
స్కిల్ డెవలప్‌మెంట్ 856.64
ఎరుుర్‌పోర్టుల అభివృద్ధి 632.79
ఓడ రేవుల అభివృద్ధి 63.82
ఐటీ రంగం 197.37
కడప స్టీల్ ప్లాంట్ 250
ఎంఎస్‌ఎంఈల మౌలిక వసతుల కల్పన 100
ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్ 180.77

సాగునీటి రంగానికి రూ.11,805.85 కోట్లు Budget 18-19
కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్షాన్ని తరిమి కొట్టి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం.. తన సంకల్పానికి తగ్గట్టుగా బడ్జెట్‌లో అందుకు పెద్దపీట వేసింది. ఆ క్రమంలో 2020-21 బడ్జెట్ కేటారుుంపుల్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,805.85 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్రానికి జీవధార అరుున పోలవరం ప్రాజెక్టుకు రూ.4,367.32 కోట్లను కేటాయించింది.

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
గాలేరు-నగరి సుజల స్రవంతి 1,173.80
వంశధార రెండో దశ 135.51
తోటపల్లి 225.57
తారకరామ తీర్థసాగరం 89.00
మహేంద్ర తనయ 97.00
వెలిగొండ 965.41
హంద్రీ-నీవా సుజల స్రవంతి 565.12
హెచ్చెల్సీ ఆధునికీకరణ 77.09
పోలవరం 4,367.32
తాడిపూడి 57.36
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 100.96
కేసీ కెనాల్ 101.00
గోదావరి డెల్టా 60.60
పులిచింతల ప్రాజెక్టు 69.01
చింతలపూడి ఎత్తిపోతల 115.00
చిన్న నీటిపారుదల 745.93
ఏపీఐఎల్‌ఐపీ-2 61.30
ఏపీఐఐఏటీపీ 106.52
తెలుగుగంగ 273.07
తుంగభద్ర బోర్డు 162.69
పులివెందుల బ్రాంచ్ కెనాల్ 68.74
కృష్ణా డెల్టా 201
కడా 129.73
ఫ్లడ్ కంట్రోల్ అండ్ డ్రైనేజీ 174.43
గుండ్లకమ్మ 17.80
పుష్కర ఎత్తిపోతల 25.48
ముసురుమిల్లి 22.11
తుంగభద్ర దిగువ కాలువ 101.00
ఎస్సార్బీసీ 94.55
గురురాఘవేంద్ర 48.49

బడ్జెట్‌లో ఇతర ముఖ్య కేటాయింపులు
 • పౌరసరఫరాల శాఖకు రూ. 3,100 కోట్లు
 • రాష్ట్ర హోం శాఖకు రూ.5,988.72 కోట్లు
 • రాష్ట్ర న్యాయ శాఖకు 913.76 కోట్లు
 • అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 200 కోట్లు
 • దిశ చట్టం అమలుకు రూ.50 కోట్లు
 • వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రూ.350 కోట్లు
 • వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి రూ.1,365.08 కోట్లు
 • మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు రూ.3,456 కోట్లు
 • వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి రూ.1,250 కోట్లు
 • వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి రూ.250 కోట్లు
 • జాతీయ మహిళా పోష్టకాహార పథకం రూ.1,577 కోట్లు
 • పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం కోసం మొత్తం రూ.6,190.33 కోట్లు
 • వైఎస్సార్ గృహ వసతికి (ఇంటి పట్టాలు) రూ. 3,000 కోట్లు
 • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) రూ. 2,540.12 కోట్లు
 • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) రూ. 500 కోట్లు
 • బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకం రూ. 150.21 కోట్లు
 • పట్టణాభివృద్ధి శాఖకు రూ.8,150.23 కోట్లు
 • ఏపీ టిడ్కోకు రూ.526.58 కోట్లు
 • పట్టణ గృహ నిర్మాణ పథకానికి రూ.900.90 కోట్లు
 • కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు
 • ఏపీ సీఆర్‌డీఏకు రూ.564.50 కోట్లు
 • స్మార్ట్ సిటీల ప్రాజెక్ట్‌కు రూ.300 కోట్లు
 • అమృత్ పథకానికి రూ.255.67 కోట్లు
 • ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు
 • పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు
 • రియల్ టైం గవర్నెన్‌‌స కోసం రూ.54.51 కోట్లు
 • గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, పట్టణ సచివాలయాలకు రూ.3,798 కోట్లు
చదవండి: బుగ్గన బడ్జెట్ ప్రసంగం

Published on 6/18/2020 12:04:00 PM

Related Topics