Sakshi education logo

ఫాస్ట్‌ట్రాక్ సెషన్స్ కోర్టుల్లో 504 పోస్టులు మంజూరు

సాక్షి, హైదరాబాద్: మహిళలపై అత్యాచారం, పిల్లలపై లైంగిక వేధింపు (పోక్సో చట్టం)లకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 36 ఫాస్ట్‌ట్రాక్ సెషన్స్ కోర్టు(ఎఫ్‌టీఎస్సీ)ల్లో 504 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
Education Newsఒక్కో కోర్టుకు 14 పోస్టుల చొప్పున మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేశారు. మంజూరు చేసిన వాటిల్లో 36 జిల్లా జడ్జి (రెగ్యులర్), 36 సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లర్క్), 36 స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్3), 36 సీనియర్ అసిస్టెంట్, 72 జూనియర్ అసిస్టెంట్, 72 టైపిస్ట్, 36 డ్రైవర్లు, 144 ఆఫీస్ సబార్డినేట్, 36 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులున్నాయి.
Published on 12/31/2019 2:51:00 PM

సంబంధిత అంశాలు