Sakshi education logo

ఏపీ డీఎస్సీ-2018 అభ్యర్థులకు పోస్టింగ్‌లు

సాక్షి, అమరావతి: డీఎస్సీ-2018 పరీక్షల్లో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
Education Newsఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు డిసెంబర్ 20నఉత్తర్వులు జారీచేశారు. 2018 డీఎస్సీలో ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూళ్లతోపాటు వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల పరీక్ష ఫలితాల విడుదల ఆలస్యమైంది. ఇప్పటికీ కొన్ని కేటగిరీల పోస్టులపై న్యాయ వివాదాలున్నాయి. నియామకాలు ఇంకా జాప్యం కాకుండా ఉండేందుకు న్యాయ వివాదాలు లేని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో ఆ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు 22న నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో ఆయా అభ్యర్థులను ఆన్‌లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చిన స్కూళ్లలోని పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మెరిట్ జాబితా ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ జాబితాను విద్యా శాఖ కమిషనరేట్‌కు అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసులున్న వాటిని మినహాయించి మొత్తం 2,654 పోస్టులకు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అత్యధిక పోస్టులున్న ఎస్జీటీ కేటగిరీపై కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ఉత్తర్వులు ఇస్తారు.

పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లాల వారీగా నియమించే పోస్టులు

జిల్లా

పోస్టులసంఖ్య

శ్రీకాకుళం

127

విజయనగరం

70

విశాఖపట్నం

43

తూర్పు గోదావరి

203

పశ్చిమ గోదావరి

157

కృష్ణా

89

గుంటూరు

116

ప్రకాశం

59

నెల్లూరు

140

చిత్తూరు

169

కడప

94

అనంతపురం

145

కర్నూలు

132


జోన్ల వారీగా మోడల్ స్కూళ్లలో నియమించే పోస్టులు

జోన్-

1155

జోన్-

214

జోన్-

3123

జోన్-

4353


బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో పోస్టుల సంఖ్య

జోన్

176

జోన్

224

జోన్

359

జోన్

4164

ఏపీ ఆర్‌ఈఐఎస్

142

మొత్తం

2,654

Published on 12/21/2019 1:23:00 PM

సంబంధిత అంశాలు