Sakshi education logo

డిగ్రీ కోర్సులకు ఏకరూప ఫీజులు!

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ కోర్సులకు ఒకే తరహా ఫీజులు నిర్ణయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో తరహా రుసుము వసూలు చేస్తోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుండగా...
Edu news ఫీజుల్లో వ్యత్యాసం కారణంగా చెల్లింపుల్లో సంక్షేమాధికా రులు తర్జనభర్జన పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో అన్ని కాలేజీలకూ ఒకే తరహా ఫీజులుం టే చెల్లింపుల ప్రక్రియ సులభతరమవుతుందనే అభిప్రాయం వ్యక్తంమవుతోంది. మరోవైపు ఇప్పటికే అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ ఒకే తరహా పాఠ్యాంశం, పరీక్షల విధానం అమలవుతున్నం దున... ఫీజులనూ ఒకే తరహాలో నిర్దేశించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గత వారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి వినతి పత్రాలు సమర్పించిన పలు కాలేజీ యజమానులు... తాజాగా సంక్షేమాధికారులకూ విన్నవించారు.
 
 ప్రవేశాల సమయంలోనే...
 డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ప్రభుత్వం సెంట్రలైజ్ చేసింది. గతంలో కాలేజీలో దరఖాస్తు చేసుకుంటే విద్యార్థుల మార్కుల ఆధారంగా సీటు కేటాయించేవారు. ఈ పరిస్థితికి స్వస్తి చెబుతూ డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్ చేసింది. దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) పేరిట ప్రత్యేక పోర్టల్ తెరిచి అందులో ఆరు వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల ప్రవేశాలను ఆన్‌లైన్ విధానంలో చేపడుతోంది. అయితే, కాలేజీని ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పించిన ప్పటికీ... కోర్సు ఫీజు, రీయింబర్స్‌మెంట్ ఎంత వస్తుందనే సమాచారం ఉండడం లేదు. ఈనేపథ్యంలో విద్యార్థులు కాలేజీలను ఎంపిక చేసుకున్న తర్వాత ఫీజులు తెలియడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ యూనిఫాం ఫీజులు ఉండాలని యాజమాన్యాలు కోరుతూ వినతులు సమర్పించాయి.
Published on 12/10/2019 4:06:00 PM

సంబంధిత అంశాలు