Sakshi education logo

ఎయిమ్స్ ప్రవేశాలూ నీట్ ద్వారానే...

Join our Community

facebook Twitter Youtube
2020-21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. మొదటిసారిగా ఎయిమ్స్, జిప్‌మర్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లను కూడా నీట్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
 దేశవ్యాప్తంగా 532 మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 914 ఆయుష్ కాలేజీల్లోని 52,720 సీట్లకు, 313 బీడీఎస్ కాలేజీల్లోని 26,949 సీట్లకు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లకు, రెండు జిప్‌మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లకు నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటిస్తుంది. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను నూటికి నూరు శాతం నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్‌ఆర్‌ఐ, బీ కేటగిరీ సీట్లను కూడా నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు.
Published on 12/2/2019 2:57:00 PM

సంబంధిత అంశాలు