Sakshi education logo

Advertisement

1,351 పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల

సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రంలోని పలు శాఖలు/ విభాగాలు/ సంస్థల కోసం 230 కేటగిరీలకు చెందిన దాదాపు 1,351 ఖాళీల భర్తీకి సిద్ధమైంది.
Career guidance ఎస్‌ఎస్‌సీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఈ) పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ www.ssc.nic.in ద్వారా 2019 ఆగస్టు 31న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/పీడబ్ల్యూడీ (వోహెచ్/హెచ్‌హెచ్/వీహెచ్/ఇతరులు) కేటగిరీలకు చెందిన, మహిళా అభ్యర్థులందరికీ ఫీజు మినహాయింపు ఉంది. వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ www.ssc.nic.in తో పాటు సదరన్ రీజనల్ ఆఫీస్ వెబ్‌సైట్ www.sscsr.gov.in లో సంప్రదించాలి. సంబంధిత పరీక్ష 2019 అక్టోబర్ 14 నుంచి 2019 అక్టోబర్ 18 మధ్య నిర్వహించే అవకాశం ఉంది.
Published on 8/14/2019 4:01:00 PM

సంబంధిత అంశాలు