Sakshieducation.com English
Sakshi education logo

గ్రామ, వార్డు సచివాలయఉద్యోగాలకు సిఫారసులు పనిచేయవు: ద్వివేది

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి రికమండేషన్లకు తావు ఉండదని.. కేవలం
Current Affairsరాత పరీక్షల్లో అభ్యర్థుల మెరిట్ ఆధారంగానే భర్తీ ఉంటుందని ఉద్యోగ నియామక ప్రక్రియకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఈ మేరకుఆగస్టు 11నఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ‘దళారులను నమ్మి మోసపోవద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరు’ అంటూ సీఎం కార్యాలయం చేసిన ప్రకటనను ఆయన తన ట్వీట్‌కు జతపరిచారు.
Published on 8/12/2019 2:20:00 PM

సంబంధిత అంశాలు