Sakshi education logo

Advertisement

సీపీజీఈటీ-2019కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు పీజీ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్‌‌స టెస్టు (సీపీజీఈటీ) ఫలితాలు ఆగస్టు విడుదల అయ్యాయి.
ఇందులో 95.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఆగస్టు 9న ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు మొత్తం 60 ఉండగా, 53 కోర్సుల్లో ప్రవేశాలకు ఓయూ జూలై 8 నుంచి 20 వరకు నిర్వహించింది. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్కువగా ఉండటంతో 7 సబ్జెక్టులను మినహాయించారు. దీంతో 53 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసేందుకు 90,354 మంది దరఖాస్తు చేసుకోగా, 78,032 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 74,815 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలు, వాటి పరిధిలోని 264 కాలేజీల్లో 30,884 సీట్లు ఉన్నాయని వివరించారు. ఓయూ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని పీజీ సెంటర్ల తొలగింపుపై వర్సిటీలకు సమాచారం లేదన్నారు. ప్రవేశాలు తక్కువగా ఉన్న పీజీ సెంటర్లను తొలగించేందుకు కళాశాల విద్యా శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని, అయితే ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదన్నారు.

తొలిసారిగా ఆన్‌లైన్‌లో...
మొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ ఒకటిన తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ వర్సిటీల్లో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ ప్రవేశ కౌన్సెలింగ్ షెడ్యూలు..
13-8-2019 నుంచి: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
16-8-2019: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం
24-8-2019: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగింపు
18-8-2019: వెబ్‌ఆప్షన్లు ప్రారంభం
26-8-2019: వెబ్‌ఆప్షన్లు ముగింపు
27-8-2019: వెబ్‌ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం
29-8-2019: తొలి దశ సీట్లు కేటాయింపు
3-9-2019 వరకు: సీట్ కన్ఫర్మేషన్, కాలేజీల్లో రిపోర్టింగ్

సీపీజీఈటీ-2019ఫలితాల కోసం క్లిక్ చేయండి

మొబైల్‌లో ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published on 8/10/2019 2:05:00 PM

సంబంధిత అంశాలు