Sakshieducation.com English
Sakshi education logo

ఎస్‌ఎస్‌సీ 1350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు

వివిధ కేంద్ర సర్వీసుల్లో 1350 సెలక్షన్ పోస్టులు(ఫేజ్ 7/2019) భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టులు: ఎంటీఎస్, సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ ప్రిజర్వేషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టాక్‌మెన్, ఫార్మసిస్ట్, మెకానిక్ తదితర పోస్టులున్నాయి.
అర్హత: పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
వయసు: పోస్టులను బట్టి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీలు: 2019, అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 31, 2019.
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 4, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
Published on 8/8/2019 4:58:00 PM

సంబంధిత అంశాలు