Sakshi education logo

Advertisement

విద్యార్థులను వలంటీర్లుగా నియమించొద్దు : గిరిజాశంకర్

సాక్షి, అమరావతి: కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులను గ్రామ వలంటీర్లుగా నియమిస్తే వెంటనే వారిని తొలగించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేశారు.
Edu newsఏదైనా ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారిని ఎంపిక చేస్తే తొలగించాలని ఆదేశించారు. రోజూ కాలేజీలకు వెళ్లేవారు, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు బాధ్యతలను సమర్థవంతంగా, చిత్తశుద్ధితో నిర్వర్తించే అవకాశం ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీపీవోలు, జెడ్పీ సీఈవోలు ఈ మేరకు ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,92,831 మంది వాలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 7న మధ్యాహ్నానికి 1,76,720 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారికీ నియామక ఉత్తర్వులు అందజేస్తామని చెప్పారు.
Published on 8/8/2019 3:41:00 PM

సంబంధిత అంశాలు