Sakshi education logo

Advertisement

టీఎస్ సబార్డినేట్ కోర్టుల్లో 1539 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1539 పోస్టుల భర్తీకి హైకోర్టు ప్రకటన విడుదల చేసింది.
Jobsపోస్టుల వివరాలు...
ఖాళీలున్న జిల్లాలు:
అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్.
విభాగాల వారీ ఖాళీలు: స్టెనోగ్రాఫర్ -54, జూనియర్ అసిస్టెంట్-277, టైపిస్టు-146, ఫీల్డ్ అసిస్టెంట్-65, ఎగ్జామినర్-57, కాపియిస్ట్-122, రికార్డ్ అసిస్టెంట్-5, ప్రాసెస్ సర్వర్-127, ఆఫీస్ సబార్డినేట్-686.
అర్హత: పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, టైప్ రైటింగ్ (హయ్యర్ గ్రేడ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టుల ప్రకారం అర్హతలు సరిచూసుకోవాలి.
వయసు: 2019, ఆగస్టు 1 నాటికి పోస్టులను బట్టి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు రూ.800; ఎస్సీ, ఎస్టీలకు రూ.400.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 4, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://hc.ts.nic.insss
Published on 8/8/2019 11:46:00 AM

సంబంధిత అంశాలు