Sakshi education logo

ఏపీఈపీడీసీఎల్‌లో 2859 ఉద్యోగాలు

Join our Community

facebook Twitter Youtube
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)..డిస్కం పరిధిలోని 5 జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల్లో 2859 ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobsసర్కిళ్ల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-679, విజయనగరం-528, విశాఖపట్నం-550, రాజమహేంద్రవరం-583, ఏలూరు-519.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంటర్ వొకేషనల్ ఉత్తీర్ణత. పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200 (ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 అదనంగా చెల్లించాలి).
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 17, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.apeasternpower.com
Published on 8/6/2019 5:08:00 PM

సంబంధిత అంశాలు