Sakshieducation.com English
Sakshi education logo

ఐబీపీఎస్ 4336 పీవో పోస్టులకు నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)..2019కి గాను (సీఆర్‌పీ-9)- 4336 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobsబ్యాంకుల వారీ ఖాళీలు: అలహాబాద్ బ్యాంక్-500, బ్యాంక్ ఆఫ్ ఇండియా-899, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-350, కెనరా బ్యాంక్-500, కార్పొరేషన్ బ్యాంక్-150, ఇండియన్ బ్యాంక్-493, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-300, యూకో బ్యాంక్-500, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-644.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభతేదీ: ఆగస్టు 7, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 28, 2019.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100; మిగిలిన వారికి రూ.600.
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019, అక్టోబర్ 12, 13, 19, 20 తేదీల్లో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: నవంబర్ 30, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in
Published on 8/6/2019 5:06:00 PM

సంబంధిత అంశాలు