Sakshieducation.com English
Sakshi education logo

ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీలో 8400 ఉద్యోగాలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. దేశవ్యాప్తంగా వివిధ రీజనల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో ఖాళీగా ఉన్న 8400 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsవిభాగాల వారీ ఖాళీలు:

విభాగం

ఖాళీలు

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)

3688

ఆఫీసర్ స్కేల్-1

3381

ఆఫీసర్ స్కేల్-2 (అగ్రికల్చర్ ఆఫీసర్)

106

ఆఫీసర్ స్కేల్-2 (మార్కెటింగ్ ఆఫీసర్)

45

ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ ఆఫీసర్)

11

ఆఫీసర్ స్కేల్-2 (లా)

19

ఆఫీసర్ స్కేల్-2 (సీఏ)

24

ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ)

76

ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్)

893

ఆఫీసర్ స్కేల్-3

157

మొత్తం

8400


తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: 829.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పోస్టులను బట్టి పని అనుభవం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయసు: ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య; ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 21-32 ఏళ్ల మధ్య; ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 21-40 ఏళ్ల మధ్య; ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100; మిగిలిన వారికి రూ.600.

ముఖ్య తేదీలు..
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ:
జూలై 4, 2019.
ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2019, ఆగస్టు 3, 4, 11 తేదీల్లో ఉంటుంది.
ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షతేదీ: 2019, ఆగస్టు 17, 18, 25 తేదీల్లో ఉంటుంది.
ఆఫీసర్స్ స్కేల్-1, 2, 3 మెయిన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 22, 2019.
ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ తేదీ: సెప్టెంబర్ 29, 2019.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ:
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in
Published on 6/20/2019 12:39:00 PM

సంబంధిత అంశాలు