Sakshi education logo

Advertisement

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) నోటిఫికేషన్ జారీ చేసింది.
Education Newsఉమ్మడి ప్రవేశాలకు షెడ్యూలును విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. అందులో టాప్ 2.31 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హులుగా ప్రకటించింది. మే 20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1.64 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వాటి ఫలితాలను జూన్ 10న ప్రకటించేందుకు ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. దీంతో ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు జోసా జూన్ 6న కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. కౌన్సెలింగ్‌ను జూలై 19 నాటికి పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కాగా, విద్యా సంస్థలు, బ్రాంచీల వారీగా అందుబాటులో ఉండే సీట్ల వివరాలు, బిజినెస్ రూల్స్‌ను తర్వాత జారీ చేస్తామని జోసా వెల్లడించింది. గతేడాది మొత్తం 37 వేల వరకు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా ఈసారి కూడా అంత మొత్తం సీట్లు అందుబాటులో ఉండే అవకాశముంది. ఐఐటీల్లో దాదాపు 11 వేలు, ఎన్‌ఐటీల్లో 18 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 3,343 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇదీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు...
జూన్ 10:
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
జూన్ 15న ఉదయం 10 గంటల నుంచి: ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు రాసిన వారు జూన్ 18 తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
జూన్ 19న ఉదయం 10 గంటలకు: మాక్ సీట్ అలకేషన్-1 డిస్‌ప్లే (జూన్ 18న ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా).
జూన్24న ఉదయం 10 గంటలకు: మాక్ సీట్ అలకేషన్-2 డిస్‌ప్లే (జూన్ 23 వరకు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా).
జూన్25న సాయంత్రం 5 గంటలకు: విద్యార్థులు రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ముగింపు.
జూన్26న: డేటా పరిశీలన, సీట్ అలకేషన్ పరిశీలన.
జూన్27న ఉదయం 10 గంటలకు: మొదటి దశ సీట్ల కేటాయింపు.
జూన్ 28 నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్.
జూలై 3న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు, రెండో దశ సీట్ల కేటాయింపు.
జూలై 4, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టిం గ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
జూలై6న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్లు కేటాయింపు.
జూలై7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
జూలై9న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాల ప్రకటన. సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు.
జూలై10, 11 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
జూలై12న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు.
జూలై13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
జూలై15న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్ల కేటాయింపు.
జూలై16, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. సీట్ల ఉపసంహరణకు ఇదే చివరి అవకాశం.
జూలై18న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ సీట్ల కేటాయింపు.
జూలై19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. కాలేజీల్లో చేరడం.
Published on 6/7/2018 11:45:00 AM

సంబంధిత అంశాలు