Sakshi education logo

Advertisement

టెట్‌లో 79 ప్రశ్నలకు కలవనున్న మార్కులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రాథమిక ‘కీ’కి సంబంధించి వివిధ సబ్జెక్టులపై వచ్చిన అభ్యంతరాల్లో 79 సహేతుకమైనవిగా పాఠశాల విద్యాశాఖ గుర్తించింది.
Education Newsపరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ 79 ప్రశ్నలకు మార్కులను కలపనున్నట్లు టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి మార్చి 12న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 4,10,828 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి పేపర్ 1, 2, 3లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల అనంతరం విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’పై మొత్తం 19,314 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో 99.40 శాతం సహేతుకం కానివని నిపుణుల కమిటీ గుర్తించింది. కేవలం 2,604 అభ్యంతరాలు (0.60) మాత్రమే సరైనవిగా గుర్తించింది. వీటన్నింటినీ పరిశీలించిన కమిటీ ఒకేరకమైన వాటిని గుర్తించి మూడు కేటగిరీలుగా విభజించింది. అవి..1. ప్రశ్నలు తప్పుగా ఉండి, సమాధానం తప్పుగా ఉండటం, 2. ప్రాథమిక ‘కీ’లో తప్పు రావడం, 3. రెండు సరైన సమాధానాలు ఇచ్చి ఉండటం. ఈ మేరకు 79 ప్రశ్నలకు మార్కులు కలపనుంది. తప్పు సమాధానాలు, తప్పు ప్రశ్నలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన మార్కులు కలవనున్నాయి. మిగిలిన వాటిలో సమాధానం ఇచ్చినవారికి మాత్రమే మార్కులు కలపనున్నారు. కొంతమంది అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసిందని, దీనిపై అధికారులతో చర్చించి మార్కులు కలపడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

పేపర్

యాడ్ స్కోర్

కీలో మార్పులు

2 జవాబులున్న పశ్నలు

1

5

11

16

2(మ్యాథ్స్)

8

8

8

2 (సోషల్)

3

5

7

3

0

3

5

మొత్తం

16

27

36

Published on 3/13/2018 2:45:00 PM

సంబంధిత అంశాలు