Sakshi education logo

Advertisement

నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ -2018

అబ్బురపరచే ఆకాశ హర్మ్యాలు, కళ్లు చెదిరే నిర్మాణాలను చూసినప్పుడు ఇంత అద్భుతంగా ఎలా కట్టారో! అనిపిస్తుంది కదా. ఎంతో నైపుణ్యం, కృషి, శ్రమ ఉంటేనే ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతాయనడంలో సందేహం లేదు. అలాంటి కట్టడాల్లో సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంత ఉంటుందో అంతే స్థాయిలో ఆర్కిటెక్టుల సృజనాత్మకతా ఉంటుంది. నిర్మాణాలను అందంగాతీర్చిదిద్దడంలోను, వాటికి చూడచక్కని రూపమివ్వడంలోనూ ఆర్కిటెక్టులదే ప్రధాన భూమిక. ఇలాంటి ఆర్కిటెక్టులుగా ఉన్నత కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలంటే రాయాల్సిన పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి నాటా-2018కు నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ).. ఏటా నాటాను నిర్వహిస్తోంది. ఇందులో సాధించే స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో చేరొచ్చు.
Adminissionsవిద్యార్హత: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/మూడేళ్ల డిప్లొమా/ఇంటర్నేషనల్ బ్యాకులరేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2018, జూలై 31 నాటికి 17 ఏళ్లు పూర్తికావాలి.
పరీక్ష విధానం:
 • మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్-ఎ కు 120 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 20, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. ఇది ఆన్‌లైన్ పరీక్ష.
 • పార్ట్-బి కూడా 90 నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. దీనికి 80 మార్కులు కేటాయించారు. ఏ4 సైజు పేపర్‌పై రెండు ప్రశ్నలకు డ్రాయింగ్స్ గీయాలి. ఒక్కో చిత్రానికి 40 చొప్పున మార్కులు ఉంటాయి.

అర్హత మార్కులు :
 • మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల (ఎంసీక్యూ) విభాగంలో కనీసం 25 శాతం మార్కులు సాధించాలి. అంటే 120 మార్కులకు కనీసం 30 మార్కులు రావాలి.
 • డ్రాయింగ్ విభాగంలో కనీసం 25 శాతం మార్కులు సాధించాలి. అంటే 80 మార్కులకు కనీసం 20 మార్కులు రావాలి.
 • మొత్తంమీద అర్హత సాధించేందుకు 200 మార్కులకు పొందాల్సిన మార్కులను పరీక్ష తర్వాత ఆర్కిటెక్చర్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది.
 • నాటా-2018లో సాధించిన స్కోర్ 2018-19 విద్యా సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటవుతుంది.

పరీక్ష సిలబస్..
 • పార్ట్- ఏలో మ్యాథ్స్, జనరల్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. మ్యాథమెటిక్స్‌లో ఆల్జీబ్రా, లాగరిథమ్స్, మ్యాట్రిసెస్, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, 3 డైమన్షల్ కోఆర్డినేట్ జామెట్రీ, థియరీ ఆఫ్ క్యాలిక్యులస్, అప్లికేషన్ ఆఫ్ క్యాలిక్యులస్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
 • జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్‌లో మ్యాథమెటికల్ రీజనింగ్, సెట్స్ అండ్ రిలేషన్‌‌స (సెట్స్, సబ్‌సెట్స్, పవర్‌సెట్, వెన్‌డయాగ్రమ్, డీమోర్గాన్స్ లాస్ తదితర అంశాలు) నుంచి ప్రశ్నలుంటాయి. వీటితో పాటు ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ క్రియేషన్‌‌సపై జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలూ ఉంటాయి. అనలిటికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ (విజువల్, న్యూమరికల్, వెర్బల్)పై కూడా ప్రశ్నలు ఎదురవుతాయి.

డ్రాయింగ్ టెస్ట్..
అభ్యర్థిలోని సృజనాత్మకతను పరీక్షించేలా ఈ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్ణీత ఆకారం లేదా వస్తువును అభ్యర్థి ముందుంచి.. దాని ఆధారంగా ఊహాశక్తితో డ్రాయింగ్ గీయమంటారు. ఒక వస్తువును పలు కోణాల్లో చిత్రించమనడం, నిర్ణీత ఆకారానికి ఆకట్టుకునే రంగులు వేయడం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నిజజీవితంలో ఎదురైన సంఘటనలను ఊహించుకుంటూ వాటికి సంబంధించిన పెన్సిల్ చిత్రాలను గీయమని అడుగుతుంటారు.
ఈ పేపర్‌ను ఒకరి కంటే ఎక్కువ ఎగ్జామినర్లు దిద్దుతారు. వారు ఇచ్చిన మార్కులను సగటు చేసి తుది మార్కులు కేటాయిస్తారు. అంతిమంగా ఈ సెక్షన్ అభ్యర్థిలోని చిత్రణా నైపుణ్యం, ఊహా శక్తి, అబ్జర్వేషన్ స్కిల్స్‌ను అంచనా వేసే పరీక్ష.

పరీక్ష వివరాలు..

సబ్జెక్టు

 

ప్రశ్నలు

మార్కులు

పరీక్ష విధానం

మ్యాథమెటిక్స్ అండ్

మ్యాథమెటిక్స్

20

40

ఎంసీక్యూ (ఆన్‌లైన్)

జనరల్ ఆప్టిట్యూడ్

జనరల్ ఆప్టిట్యూడ్

40

80

ఎంసీక్యూ (ఆన్‌లైన్)

డ్రాయింగ్ టెస్ట్

 

2

80

పేపర్, పెన్సిల్

నాటా ద్వారా పరీక్షించే అంశాలు..
 • సునిశిత పరిశీలన నైపుణ్యాలు.
 • సంబంధసామ్యం లేదా అనుపాతాలపై అవగాహన.
 • డ్రాయింగ్ నైపుణ్యాలు.
 • క్రిటికల్ థింకింగ్.
 • కళాసౌందర్యాత్మక దృష్టి.
పరీక్ష కేంద్రాలు :
తెలంగాణ:
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు:
2018, జనవరి 16 నుంచి మార్చి 2 వరకు.
పరీక్ష రుసుం: ఎస్సీ/ఎస్టీలకు రూ.1,500; మిగిలిన వారికి రూ.1,800.
పరీక్ష తేదీ: 2018, ఏప్రిల్ 29 (ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి 1.30 వరకు
ఫలితాల విడుదల: 2018, జూన్ 1.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.nata.in
Published on 1/12/2018 5:56:00 PM

సంబంధిత అంశాలు