Sakshi education logo

Advertisement

టీఎస్ ట్రాన్స్‌కో...ఇంజనీర్ కొలువుకు గెలుపు మెట్లు..

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ (టీఎస్ ట్రాన్స్‌కో).. 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్); 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, సివిల్, టెలికం) ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అర్హతలు, ఎంపిక విధానం, విజయానికి సూచనలు..
Edu newsసబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) :
అర్హతలు :ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు; పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
  • మొత్తం 100 మార్కుల ఆధారంగా సబ్ ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించిన ఇన్‌సర్వీస్ అవుట్‌సోర్స్ ఉద్యోగులకు గరిష్టంగా 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్ష, సర్వీస్ వెయిటేజీ మార్కులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
  • రాత పరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. రుణాత్మక మార్కులుండవు. ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లుంటాయి. సెక్షన్ ఏలో డిప్లొమా ఎలక్ట్రికల్ సబ్జెక్టుకు సంబంధించి 65 ప్రశ్నలుంటాయి. సెక్షన్ బీలో జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్షలో అర్హత మార్కులు: ఓసీ-40%, బీసీ-35 శాతం; ఎస్సీ/ఎస్టీ- 30%; పీహెచ్-30 శాతం.

సన్నద్ధత..
  • ఎలక్ట్రికల్ మెషీన్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్, డీసీ జనరేటర్ అండ్ మోటార్, త్రీపేజ్ ఇండక్షన్ మోటార్, సింగిల్ పేజ్ ఇండక్షన్ మోటార్, కమ్యుటేటర్ మోటార్ అంశాలపై దృష్టిసారించాలి. ఆర్మేచర్ రియాక్షన్, టార్క్ స్పీడ్ ఈక్వేషన్, టెస్టింగ్ మెథడ్ ముఖ్యమైనవి.
  • ట్రాన్స్‌ఫార్మర్ అంశంలో కన్‌స్ట్రక్షన్ ఆపరేషన్స్, టెస్ట్స్, ఫార్ములాలకు సంబంధించి చిన్నపాటి సమస్యల సాధనను ప్రాక్టీస్ చేయాలి.
  • ఇండక్షన్ మోటార్, కమ్యుటేటర్ మోటార్ చాప్టర్లలో టార్క్ ఈక్వేషన్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఆపరేషన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలపై దృష్టిసారించాలి.
  • మెషీన్స్‌లో వచ్చే చిన్న ఈక్వేషన్ ఫార్ములాలను ప్రత్యేకంగా నోట్ చేసుకొని, వీలైనప్పుడు చదువుతుండాలి. దీన్నుంచి దాదాపు 20 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
  • స్విచ్‌గేర్, ప్రొటెక్షన్ నుంచి 8-10 ప్రశ్నలు రావొచ్చు. ఫ్యూజులు, ఐసోలేటర్లు, సర్క్యూట్ బ్రేకర్స్ రకాలు, సెలెక్షన్ ఆఫ్ లొకేషన్ అంశాలు ముఖ్యమైనవి.
  • ప్రొటెక్టివ్ రిలేయింగ్‌లో టైప్స్ ఆఫ్ రిలేస్, వాటి అప్లికేషన్స్; buchholz relay, మెర్జ్ ప్రైస్ ప్రొటెక్షన్, బస్‌బార్ ప్రొటెక్షన్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
  • ట్రాన్స్‌మిషన్‌లో sag calculation కు సంబంధించిన సమస్యలు, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, కండక్టర్, డిఫరెన్షియల్ వోల్టేజ్, లెవెల్ రేటింగ్స్‌పై దృష్టిసారించాలి. వీటినుంచి దాదాపు 18 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు.
  • ట్రాన్స్‌మిషన్ లైన్ పెరామీటర్స్ సబ్జెక్టులో సిమెట్రిక్, అసిమెట్రిక్ టైప్స్; వోల్టేజ్ క్యాలిక్యులేషన్‌పై సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. నామినల్, నామినల్ టి-మెథడ్స్; క్రిటికల్ వోల్టేజ్, కరోనా ఫ్యాక్టర్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటినుంచి 12-15 మార్కులకు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ ప్రిపరేషన్‌కు రోజులో కొద్ది సమయాన్ని కేటాయించాలి. పత్రికలు చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. తెలంగాణ సంస్కృతి, ఉద్యమ అంశాలపై పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల ఆధారంగా అవగాహన పెంపొందించుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2018.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 25, 2018.

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, సివిల్, టెలికం) :
అర్హతలు :
ఎలక్ట్రికల్/సివిల్/టెలీకమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు; పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం :
ప్రశ్నపత్రంలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. సెక్షన్-ఏలో ఆయా పోస్టులకు సంబంధించిన టెక్నికల్ సబ్జెక్టు (ఎలక్ట్రికల్/ సివిల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) నుంచి 80 ప్రశ్నలు; సెక్షన్-బీలో జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.

సన్నద్ధత..
ఎలక్ట్రికల్ :
  • ఎలక్ట్రికల్ మెషీన్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, మెజర్‌మెంట్స్; మ్యాథమెటిక్స్, సిగ్నల్ సిస్టమ్స్, ఈఎంఎఫ్ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి.
  • ఎలక్ట్రికల్ మెషీన్స్ నుంచి దాదాపు 15 మార్కులకు, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ నుంచి దాదాపు 25 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కంట్రోల్ సిస్టమ్స్, మెజర్‌మెంట్స్ నుంచి 10 మార్కులకు ప్రశ్నలు ఉండొచ్చు. అదే విధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 12, మ్యాథమెటిక్స్ నుంచి 8, ఈఎంఎఫ్ నుంచి 3 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. బి.ఎల్.థెరాజా, పి.ఎస్.బింభ్రా తదితర పుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవచ్చు.
ఉదా:
1. Damping ratio of second order systems whose characteristics equation is s2+3s+100 is?
1) 0.15 2) 0.25
3) 0.35 4) 0.45
సమాధానం: 1

సివిల్ :
  • ఆర్‌సీసీ, కాంక్రీట్ టెక్నాలజీ, బిల్డింగ్ మెటీరియల్స్ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి.
  • గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఈ విభాగం వారు ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్‌పై దృష్టిసారించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), ఐఈఎస్‌కు సంబంధించిన పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఆర్.ఎస్.ఖుర్మి, ఇతర ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు.
ఉదా:
1. The water content of soil can..
1) be less than zero percent
2) be greter than 100 percent
3) Never be greter than 100 percent
4) None
సమాధానం: 2

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ :
ముఖ్యంగా సిగ్నల్ సిస్టమ్, కమ్యూనికేషన్, నెట్‌వర్క్ థియరీ, కంట్రోల్ థియరీ; ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ (ఈఎంటీఎల్) అంశాలపై దృష్టిసారించాలి. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ అంశాలను కూడా అధ్యయనం చేయాలి.

ఉదా:
1. Which of the following is faster A/D convertor?
1) Ramp type
2) Successive approximation
3) Flash type
4) Dual stop
సమాధానం: 3

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2018.
పరీక్ష తేదీ: మార్చి 11, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.tstransco.cgg.gov.in
Published on 1/10/2018 2:55:00 PM

సంబంధిత అంశాలు