Sakshi education logo

టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ బుక్‌లెట్ (ప్రిలిమ్స్/మెయిన్స్)

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా, ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Education Newsఇంత తీవ్ర పోటీ ఉన్న పరీక్ష ఏప్రిల్ 24న జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజయానికి తోడ్పడేలా ‘సాక్షి’ కానిస్టేబుల్ స్పెషల్ బుక్‌లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కోచింగ్‌కు వెళ్లలేని గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ బుక్‌లెట్‌ను రూపొందించింది. ఇందులో సిలబస్‌లోని అన్ని అంశాలకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర, ఉద్యమంలో ముఖ్య ఘట్టాలు, తెలంగాణ వైతాళికులు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ చరిత్ర, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను బుక్‌లెట్‌లో పొందుపరిచారు. పోలీస్ కానిస్టేబుల్ బుక్‌లెట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. పుస్తకం వెల కేవలం రూ. 100. మరిన్ని వివరాలకు మీకు దగ్గర్లోని సాక్షి ఏజెంట్‌ను సంప్రదించండి.
Published on 3/22/2016 11:59:00 AM

సంబంధిత అంశాలు