Sakshi education logo

ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలు... విజయానికి మార్గాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు! బ్యాంకింగ్ సేవలు, కార్యకలాపాలు విస్తృతం చేస్తూ.. శాఖల సంఖ్య పెంచుతున్న బ్యాంకు! ఇందుకు అనుగుణంగా.. మానవ వనరుల నియామకానికి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది!
Career guidance తాజాగా.. 8000 క్లరికర్ స్థాయి జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. దేశవ్యాప్తంగా పలు సర్కిల్స్ పరిధిలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ వివరాలు.. ఎంపిక ప్రక్రియ... ప్రిపరేషన్ గెడైన్స్...

బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకొని.. ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. క్లరికల్ స్థాయి జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్ట్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 18 సర్కిల్స్ పరిధిలో మొత్తం 8000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్య 525. హైదరాబాద్(తెలంగాణ) సర్కిల్ పరిధిలో 375; అమరావతి(ఆంధ్రప్రదేశ్) సర్కిల్ పరిధిలో 150 పోస్ట్‌లు ఉన్నాయి.

డిగ్రీ అర్హత :
జనవరి 1, 2020లోపు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అలాంటి అభ్యర్థులు సదరు కోర్సులను జనవరి 1, 2020లోపు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్స్ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్. ముందుగా ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్ నిర్వహిస్తారు.

{పిలిమినరీ.. ఇలా
{పిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో వంద మార్కులకు జరుగుతుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
విభాగం ప్రశ్నలసంఖ్య మార్కులు సమయం (నిమిషాల్లో)
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 20
న్యూమరికల్ ఎబిలిటీ 35 35 20
రీజనింగ్ ఎబిలిటీ 35 35 20
మొత్తం 100 100 60
{పతి సెక్షన్‌కు వేర్వేరుగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించారు. అభ్యర్థులు సదరు సెక్షన్‌ను ఆ సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏ మీడియంలో పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో దరఖాస్తు సమయంలోనే తెలియజేయాలి. ఒకవేళ మాతృ భాష కాకుండా వేరే భాషలో పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపితే... అలాంటి అభ్యర్థులకు మెయిన్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సర్కిల్‌లో అధికార భాషకు సంబంధించిన స్థానిక భాషా పరీక్షకు హాజరు కావాలి.

మెయిన్ ఎగ్జామినేషన్ :
{పిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఒక్కోపోస్ట్‌కు పది మంది చొప్పున అర్హత లభిస్తుంది. మెయిన్ పరీక్ష సైతం ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం (నిమిషాల్లో)
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 50 35
జనరల్ ఇంగ్లిష్ 40 40 35
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45
రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 60 45
మొత్తం 190 200 160

తుది జాబితా:
ఎంపిక ప్రక్రియలో రెండు దశల (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్) విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీలో నిర్ణీత కటాఫ్ మార్కులు పొందితేనే.. మెయిన్ పరీక్ష మూల్యాంకన చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే చక్కటి ప్రతిభ కనబరిచే విధంగా సన్నద్ధం కావాలి.

{పిలిమ్స్ నుంచే మెయిన్ :
తుది జాబితాలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్ దిశగా అడుగులు వేయాలి. ప్రిలిమ్స్‌లో ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ సబ్జెక్ట్‌లను.. మెయిన్ సిలబస్ అంశాలైన జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీలకు ఒకే సమయంలో ప్రిపరేషన్ సాగించాలి. మొదట్నుంచే మెయిన్ కోణంలో ప్రిపరేషన్ సాగిస్తే.. ప్రిలిమ్స్‌ను తేలిగ్గానే అధిగమించే వీలుంటుంది.

ముందుగా సన్నద్ధత :
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం-ప్రిలిమినరీ ఫిబ్రవరి లేదా మార్చిలో; మెయిన్ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రిలిమ్స్ తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్‌లో కామన్‌గా ఉన్న సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. మెయిన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. వాస్తవానికి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమవడం మేలు.

కెరీర్ ఇలా..
క్లర్క్ స్థాయిలో నియామకం ఖరారు చేసుకున్న వారికి ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. క్లర్క్‌గా కెరీర్ మొదలవుతుంది. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సీజీఎం స్థాయి వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులు మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తే... ట్రైనీ ఆఫీసర్ హోదా లభిస్తుంది. జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ విధానంలో 20ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదాకు సైతం చేరుకోవచ్చు.

{పిపరేషన్ వ్యూహాలు...
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. కేవలం గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

న్యూమరికల్ ఎబిలిటీ: మెయిన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ-నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలసిస్‌లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.

రీజనింగ్: ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్ రెండింట్లో ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్, సిలాయిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్ సమయానికి ఈ అంశాల్లో పట్టు సాధిస్తే... మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను పూర్తి చేసినట్లవుతుంది.

జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్: మెయిన్‌లో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. బ్యాంకింగ్ రంగం తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు,కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో.. కరెంట్ అఫైర్స్,స్టాక్‌జనరల్ నాలెడ్జ్,ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు) కు ప్రాధాన్యం ఇవ్వాలి.

కంప్యూటర్ ఆప్టిట్యూడ్: మెయిన్‌లో మాత్రమే ఉండే మరో విభాగం.. కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్,కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాలు(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి.

గత ప్రశ్న పత్రాల సాధన..
అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం లాభిస్తుంది. దీనివల్ల ఆయా విభాగాలు, అంశాల పరంగా ఏ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్‌కు వెయిటేజీ ఉంటుందనే విషయంపై అవగాహన లభిస్తుంది. గ్రాండ్ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. అదే విధంగా మోడల్, మాక్ టెస్ట్‌లకు హాజరవడం కూడా మేలు చేస్తుంది. దీనివల్ల పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్‌మెంట్ పరంగా స్పష్టత లభిస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ కోసం చదివితే ప్రిలిమ్స్‌లో సులువుగా గట్టెక్కడంతోపాటు మెయిన్‌కు సైతం సన్నద్ధత లభిస్తుంది.

దరఖాస్తు విధానం :
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇందుకోసం https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers-Recruitment of Junior Associates 2020 వెబ్‌సైట్స్‌లో ముందుగా లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నిర్ణీత ఫీజును చెల్లించాలి(జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.750). ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
  • దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము హాజరవదలచుకున్న సర్కిల్ వివరాలు పేర్కొనాలి. కేవలం ఒక సర్కిల్‌ను మాత్రమే ఎంచుకోవాలి. రెండు లేదా మూడు సర్కిల్స్‌ను ఎంచుకోవడం కుదరదు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sbi.co.in/careers

నోటిఫికేషన్ వివరాలు..

మొత్తం పోస్ట్‌లు: 8000
హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ)లో ఖాళీలు: 375
అమరావతి సర్కిల్ (ఆంధ్రప్రదేశ్)లో ఖాళీలు: 150
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయో పరిమితి: జనవరి 1, 2020 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.
బేసిక్ పే: రూ.13,075. వీటికి అదనంగా డీఏ, ఇతర భత్యాలు లభిస్తాయి.
{పిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి / మార్చి నెలల్లో, 2020
మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: ఏప్రిల్ 19, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 26, 2020

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ అభ్యర్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాలి. ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్స్‌కు సంబంధించిన కాన్సెప్ట్యువల్ నాలెడ్జ్, అప్లికేషన్ అప్రోచ్‌తో అడుగులు వేయాలి. ప్రతి అంశంలోని ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తూ వాటిని అన్వయించేలా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ / న్యూమరికల్ ఎబిలిటీ విషయంలో హైస్కూల్ స్థాయి గణిత అంశాల బేసిక్స్‌పై పట్టు సాధించాలి.
- వినయ్ కుమార్ రెడ్డి, డెరైక్టర్, ఐఏసీఈ
Published on 1/13/2020 5:57:00 PM

సంబంధిత అంశాలు