Sakshi education logo

ఇంగ్లిష్ మీడియం మోడల్ స్కూళ్లలోఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంగ్లిష్ మీడియం మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి జనవరి 28న నో టిఫికేషన్ జారీ చేయనున్నట్లు మోడల్ స్కూ ల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి జనవరి 27 (సోమవారం)నఓ ప్రకటనలో తెలిపారు.
Education Newsవిద్యార్థులు ఆన్‌లైన్‌లో http://telanganams.cgg.gov.in ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఐదో తరగతి చదివే వి ద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ప్రవే శ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్ష ఏప్రిల్ 12న ఉంటుందని తెలిపారు. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఫిబ్రవరి 3 నుం చి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని, 4వ తేదీ నుంచి 29లోగా దరఖాస్తులను సబ్మిట్ చేయాలని సూ చించారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలకు వచ్చే నెల 7 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని, వచ్చే నెల 8 నుంచి మార్చి 2వ తేదీలోగా దరఖాస్తులను సబ్మిట్ చేయాలని సూచించారు. మోడల్ స్కూళ్ల లో సీట్లు లభించే విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం లో చదువు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు వంటి సదుపాయాలు ఉం టాయని, బాలికలకు వాటితోపాటు హాస్టల్ సదుపాయం, కాస్మొటిక్ కిట్స్ అందిస్తామని చెప్పారు.

ఇదీ షెడ్యూల్..
  • 28-1-2020: నోటిఫికేషన్ విడుదల
  • 3-2-2020 నుంచి 29-2-2020 వరకు: 6వ తరగతిలో ప్రవేశాలకు ఫీజు చెల్లింపు
  • 4-2-2020 నుంచి 29-2-2020 వరకు: 6వ తరగతిలో ప్రవేశాల దరఖాస్తుల సబ్మిషన్
  • 7-2-2020 నుంచి 2-3-2020 వరకు: 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్లలో ప్రవేశాలకు ఫీజు చెల్లింపు
  • 8-2-2020 నుంచి 2-3-2020 వరకు: 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు
  • మిగులు సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తుల సబ్మిషన్
  • 9-4-2020 నుంచి 12-4-2020 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
  • 12-4-2020: ప్రవేశపరీక్ష (6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 గంటలవరకు, 7, 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు)
  • 20-5-2020: ఫలితాల వెల్లడి
  • 27-5-2020: ఎంపికైన వారి జాబితా ప్రకటన
  • 28-5-2020 నుంచి 31-5-2020 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు
Published on 1/28/2020 2:50:00 PM

సంబంధిత అంశాలు