Sakshi education logo

వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లు విడుదల.. ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు.
Education News
ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్, సహా వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇలా ఉండగా, ఈ ఏడాది ఏపీ ఐసెట్‌ను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 64,822 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 45 పట్టణాల్లో నాలుగు సెషన్స్ లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

Must Check:

1. EAMCET Quick Review

2. EAMCET topic-wise Practice Tests

3. EAMCET Bitbank

4. EAMCET Previous Papers

5. EAMCET Online Mock Tests  

ఆయా ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లు ఇలా ఉన్నాయి

ఏపీ ఐసెట్

సెప్టెంబర్ 10, 11

ఏపీ ఈసెట్

సెప్టెంబర్ 14

ఏపీ ఎంసెట్

సెప్టెంబర్ 17 నుంచి25వ తేదీ వరకు

ఏపీపీజీఈసెట్

సెప్టెంబర్ 28, 29, 30

ఎడ్‌సెట్

అక్టోబర్ 1న ఉదయం

లాసెట్

అక్టోబర్ 1న మధ్యాహ్నం

ఏపీ పీఈసెట్

అక్టోబర్ 2 నుండి 5వ తేదీ వరకు

Published on 8/15/2020 12:35:00 PM

సంబంధిత అంశాలు