Sakshi education logo

‘కోర్సెరా’ భాగస్వామ్యంతో 50 వేల మంది నిరుద్యోగులకు శిక్షణ

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్‌‌జ (టాస్క్) ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక కోర్సెరాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Education Newsకోర్సెరా వర్క్‌ఫోర్స్ రికవరీ ఇనిషియేటివ్ గ్లోబల్ రోల్ అవుట్‌లో భాగంగా ఈ భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు టాస్క్ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 50వేల మంది నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ పాఠాల ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చెయిన్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి 3,800 ఉద్యోగ సంబంధిత కోర్సులు టాస్క్ ద్వారా అందిస్తారు. కోర్సెరాతో ఒప్పందంలో భాగంగా ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా గూగుల్ ఐటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ వంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు కూడా పొందే అవకాశం ఉంటుంది.
Published on 7/15/2020 2:01:00 PM

సంబంధిత అంశాలు