తెలంగాణ పదో తరగతిలో 10/10 పాయింట్స్ సాధించాలంటే సూచనలు...

పదో తరగతి మైలురాయిని ఘనమైన ‘గ్రేడ్’తో దాటితే అత్యున్నత కెరీర్ దిశగా అడుగులు పడుతున్నట్లే! మార్చిలో జరగబోయే ‘పది’ పరీక్షలకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తాజాగా తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరీక్షల్లో 10/10 గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) సాధనకు సబ్జెక్టు నిపుణుల సూచనలు..
Career Guidanceతెలుగు
 • పణాళిక: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం చదివితే తెలుగులో 10 జీపీఏ సాధించడం తేలికే. వ్యక్తిగత సామర్థ్యం, పాఠ్యాంశాల కాఠిన్యతను దృష్టిలో ఉంచుకొని, 60 రోజుల్లో ఉపవాచకం సహా అన్ని పాఠాల అధ్యయనానికి రోజువారీ ప్రణాళికను రూపొందించుకొని, అమలు చేయాలి. మిగిలిన సమయాన్ని పునశ్చరణ, లోపాలను సరిదిద్దుకునేందుకు ఉపయోగించుకోవాలి.
 • పశ్నపత్రంపై అవగాహన: ఇప్పటికే అందరికీ ప్రశ్నపత్రంపై అవగాహన ఏర్పడి ఉంటుంది. ఎవరికైనా పేపర్లపై అస్పష్టత ఉంటే దాన్ని అధిగమించాలి. పరిపూర్ణ సన్నద్ధతకు ఇదే మూలమని గుర్తించాలి.
 • స్వీయ వ్యక్తీకరణ సామర్థ్యం: ఏ విషయాన్నయినా చక్కని భాషా పటిమతో సొంతంగా రాయగలిగే శక్తిని సముపార్జించుకోవడం ముఖ్యం. తాము చదివిన, అనుభవంలోకి వచ్చిన అంశాలను సందర్భోచిత పదాలను ఉపయోగిస్తూ, అర్థవంత వాక్యాల్లో అవసరమైన నిడివిలో రాయడం కీలకం. సీసీఈ విధానంలో జరిగే పరీక్షల్లో విజయానికి ఇది కీలకం.
 • సమగ్ర అవగాహన: ఒక పాఠంలోని విషయంతో పాటు ఆ పాఠం లక్ష్యం, ఉద్దేశం, చర్చనీయాంశాలు తదితరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అప్పుడే ఆ పాఠం నుంచి ప్రశ్న ఏ విధంగా వచ్చినా, కచ్చితమైన సమాధానం రాసే నేర్పు అలవడుతుంది.
 • ఉపవాచకం-విశ్లేషణ: కథా సారాంశాన్ని తెలుసుకోవాలి. పాత్రల స్వభావాలు, సన్నివేశాలపై స్పష్టమైన అవగాహన అవసరం.
 • సృజనాత్మక అంశాలు-స్వరూప స్వభావాలు: సృజనాత్మక అంశాలకు సంబంధించి ప్రతి ప్రక్రియ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇచ్చిన ఏ అంశాన్నయినా సంబంధిత ప్రక్రియలో వ్యక్తీకరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
 • పాఠాలు-పదజాలం: ప్రతి పాఠంలో ఉండే అర్థాలు, సొంత వాక్యాల ప్రయోగం, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్తులు; ప్రకృతి-వికృతులపై పూర్తిస్థాయి అవగాహన అవసరం.
 • వ్యాకరణాంశాలు: సంధి, సమాసం, ఛందస్సు, అలంకారం, వాక్యం.. ఈ ఐదు అంశాలపై స్పష్టత అవసరం. పాఠాల చివర ఇచ్చిన వ్యాకరణాంశాలు-వాటికి పాఠ్యపుస్తకంలో ఉన్న ఉదాహరణలు/ఆధారాలను స్పష్టంగా తెలుసుకోవాలి.
 • అందమైన, దోషరహిత రాత: గుండ్రంగా, అందంగా, స్పష్టంగా, తప్పులు లేకుండా రాయడం పరీక్షల్లో విజయానికి కీలకం.

జీవశాస్త్రం :
 • పాఠ్యాంశాల్లోని అన్ని భావనలను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. పోషణ-స్వయం పోషణ, పరాన్న జీవ పోషణ; మానవునిలో జీర్ణక్రియ, జీర్ణ గ్రంథులు, విటమిన్లు, పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు.. ఇలాంటివన్నీ భావనలే.
 • పట్టికలు, ఫ్లోచార్టులు, వ్యవస్థీకృత చార్టులు తదితరాలు పరీక్షల కోణంలో ముఖ్యమైనవి. వీటిని అధ్యయనం చేయడం వల్ల అధిక మార్కులు సాధించొచ్చు.
 • పటాలు గీయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆకు అడ్డుకోత, హరితరేణువు, మైటోకాండ్రియా, ఊపిరితిత్తులు, హృదయం, మూత్రపిండం అడ్డుకోత, మానవ విసర్జన వ్యవస్థ, మెదడు, జీవావరణ పిరమిడ్ తదితర పటాలను నేర్చుకోవాలి.
 • గతంలో మాదిరి ప్రయోగాన్ని నేరుగా అడక్కుండా, భిన్నంగా ఇస్తున్నారు. ఉదాహరణకు ప్రయోగ చిత్రం ఇచ్చి వివరించమని అడగొచ్చు. అందువల్ల పరికరాలు, విధానం, పరిశీలనలు, ఫలితాలపై అవగాహన పెంపొందించుకుంటే ప్రశ్న ఏ విధంగా వచ్చినా కచ్చితమైన సమాధానం ఇవ్వొచ్చు. పాఠం చివర ఉన్న ‘అభ్యసనం మెరుగుపర చుకుందాం’ ప్రశ్నలపై దృష్టిసారించాలి. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఎంత పెద్ద సమాచారాన్నయినా క్లుప్తంగా చెప్పడాన్ని కూడా అలవరచుకోవాలి. 10 జీపీఏ సాధనకు ఇవి కీలకమని గుర్తించాలి.
 • మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. దీనివల్ల ఏ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం రాయాలనేది అలవడుతుంది. ఇలా సమాధానాలు రాసేటప్పుడు 1 మార్కు ప్రశ్నకు ఒకట్రెండు వాక్యాలు; రెండు మార్కుల ప్రశ్నకు మూడునాలుగు వాక్యాలు; 4 మార్కుల ప్రశ్నకు ఏడెనిమిది వాక్యాలు సరిపోతాయి. అవసరమైన చోట బొమ్మలు గీయాలి.

ఇంగ్లిష్
We have only three months to final exams. So be on the track to reach your goal 10/10. Follow these steps to enhance your ability to score high.
 • Read Text Book thoroughly. As we already know Paper-1 tasks will come from Text Book. Thorough reading means reading with understanding in terms of concept, vocabulary, grammar, idiomatic expressions and discourse nature.
 • You have to print the blueprint of the exam in your brain. Check the Summative Assessment-I papers for better understanding. Sections, Question Numbers, Category of questions, how many sentences to write, discourses categorization, Parameters of evaluation etc. are to be checked. e.g. Don’t write more than three sentences for 2 marks descriptive questions of Section-A. Don’t write more than two sentences for 1 mark descriptive questions of Section-A.
 • Find out your strengths and weaknesses. Every Student is unique. One may be good at Reading Comprehension another may be good at Grammar. So know your weak area and concentrate on that.
 • Major and Minor discourses will come for 30 marks (15+15). That means major part depends on Creative Writing. Select one example (model) for every discourse. Making little changes to that becomes a new one. First begin with Description. It is mother of all discourses. Choreography Script may be prepared at the end.
 • Collaborative Study always helpful. You have to join the group where your weak area can be explained by another student, who is good at that. Peer group learning is better in many ways. A group consist of 4 or 5 is ideal.
 • Editing is an important process, which can shine our language ability. What ever the discourse you prepare, present it before your class or group. Ask them to edit it. This thing helps you to answer Section-B and C.
 • Quiz/Debate Method of learning is useful for Section-A mainly. If there are two groups- one group announces a passage and asks questions. Other group has to answer by looking into the passage. After ten questions take turns. Try to ask more open ended questions and extrapolating questions.
 • Prepare your own question paper. This makes tough in the beginning but gives you complete idea on the pattern. Feel that you are a paper setter. After few rough papers definitely you can prepare number of model papers easily.
 • Remember that questions in the previous papers will never come again in ten years. So don’t try to memorise previous questions. They are only model to understand. Practising model papers will helps you score high.
 • Combinations of preparations always helpful. If you want to learn writing biographical sketch try it. After that read the biographies given in the Textbook, “I Will Do It, A Tribute”. Then practise comprehension questions, Vocabulary and Grammar on that. That means you are preparing for Creative Writing (discourses) as well as Section A and B. This connectivity is very much important.
 • No choice: Don’t leave any part of the Textbook or any Section or any discourse as your choice. Leaving as choice will lead you in trouble.
 • There is nothing unimportant in the syllabus. Many students ask for important questions. But there is no such classification in English subject. Every chapter, Every Passage, Every Sentence and Every Expression is important.
 • Draw a time table and follow it. Believe it or not there are no shortcuts to success. Don’t be afraid of syllabus. Set very small goals like single passage or single minor discourse. Practise it. Then feel confident that you achieved a small portion. After that go for the next.

 

A(BasedonTextbook) Paper-I

B (Independent) Paper-II

Major Discourses (10 Marks)

Story/Narrative, Conversation, Description, Drama Script/Play, Interview and Choreography

Biography, Essay, Report/News report, Letter and Speech (Script)

Minor Discourses (5 Marks)

Message, Notice, Diary

Poster,Invitation, Profile


మ్యాథమెటిక్స్
 • గణితం సబ్జెక్టులో పూర్తి మార్కులు సాధించాలంటే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
 • గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళి, భారత్వం (వెయిటేజీ)పై అవగాహన పెంపొందించుకోవచ్చు.
 • క్లిష్టంగా అనిపించే సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి, శ్రేఢులు, నిరూపక జ్యామితిలోని అన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. సిలబస్‌ను డిసెంబర్/జనవరి నాటికి పూర్తిచేయాలి.
 • గణితం.. సూత్రాలపై ఆధారపడిన సబ్జెక్టు కాబట్టి, ప్రతి చాప్టర్‌లోని సూత్రాలను ఒకచోట రాసుకొని, నేర్చుకోవాలి.
 • కచ్చితంగా వ్యాసరూప ప్రశ్నల విభాగంలో గ్రాఫ్ సమస్యలు వస్తాయి. కాబట్టి బహుపదులు, రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల చాప్టర్లలోని గ్రాఫ్ సమస్యలు; సాంఖ్యక శాస్త్రం చాప్టర్‌లోని ఓజీవ్ వక్రం గ్రాఫ్ సమస్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి.
 • కచ్చితంగా నిర్మాణ సమస్యలు వ్యాసరూప ప్రశ్నలుగా వస్తాయి. కాబట్టి సరూప త్రిభుజాలు చాప్టర్‌లోని ఇచ్చిన త్రిభుజానికి సరూపంగా ఉండే మరో త్రిభుజాన్ని నిర్మించే సమస్య; వృత్తాలకు స్పర్శరేఖలు-ఛేదనరేఖలు చాప్టర్‌లో వృత్తానికి స్పర్శరేఖలను నిర్మించే సమస్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి.
 • సిద్ధాంతాలు కూడా ముఖ్యమైనవే కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం (థేల్స్ సిద్ధాంతం), పైథాగరస్ సిద్ధాంతం, వాటిపై సమస్యలు, వృత్తఖండ వైశాల్యాన్ని కనుగొనే సమస్యను కచ్చితంగా నేర్చుకోవాలి. పది మార్కులను బిట్లకు కేటాయించారు. కాబట్టి పది గ్రేడ్ పాయింట్లు సాధించడంలో ఇవి కూడా కీలకం. ప్రతి చాప్టర్‌లోని అన్ని బిట్లను ప్రాక్టీస్ చేయాలి.

ఫిజికల్ సైన్స్
 • విషయావగాహన విద్యా ప్రమాణానికి 40 శాతం భారత్వముంది. దీన్నుంచి 16 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
 • ప్రశ్నించడం-పరికల్పన చేయడం విద్యా ప్రమాణం నుంచి 4 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఎక్కువగా విద్యార్థి ఊహాత్మక శక్తిని పరీక్షించేలా ఉంటాయి. (ఉదా: వలయంలో వోల్టుమీటర్‌ను బ్యాటరీకి శ్రేణిలో కలిపితే ఏమవుతుంది?).
 • ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన ప్రశ్నలకు 6 మార్కులుం టాయి. ప్రయోగాలు చేస్తే ఈ విభాగం నుంచి వచ్చే అన్ని ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు.
 • సమాచార సేకరణ-ప్రాజెక్టు పనులు విద్యా ప్రమాణం నుంచి 4 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పట్టికలు ఇచ్చి, విశ్లేషణాత్మక ప్రశ్నలు ఇస్తారు. ఇందులో పట్టు సాధించాలంటే భావనలపై మంచి అవగాహన అవసరం.
 • బొమ్మల ద్వారా భావ ప్రసారం నుంచి 6 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏదైనా సందర్భానికి బొమ్మను గీయడం, అసంపూర్తి పటాన్ని పూర్తిచేయడం, ఏదైనా దృగ్విషయాన్ని పటం సహాయంతో వివరించడం తదితర ప్రశ్నలుంటాయి. అందువల్ల పటాలపై పట్టు సాధించాలి.
 • నిత్య జీవితంలో వినియోగం విద్యా ప్రమాణం నుంచి 4 మార్కులకు ప్రశ్నలుంటాయి. వివిధ భౌతిక దృగ్విషయాలు, రసాయన చర్యల నిత్యజీవిత వినియోగంపై అవగాహన పెంపొందించుకుంటే తేలిగ్గా మార్కులు సాధించొచ్చు.
 • ఉదా: ఎముకలు విరిగినప్పుడు డాక్టర్లు కట్టుకట్టడానికి ఉపయోగించే తెల్లని పొడి ఏమిటి? దీని ఇతర ఉపయోగాలు ఏవి?

సాంఘికశాస్త్రం
 • సాంఘికశాస్త్రంలో ‘విషయావగాహన’ విద్యా ప్రమాణం అధిక మార్కులు తెచ్చిపెడుతుంది. అందువల్ల ప్రతి పాఠ్యాంశాన్ని ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఫ్యాక్ట్స్ ఆధారిత, సైడ్ హెడ్డింగ్స్‌తో ఉన్న విషయాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. అవగాహన చేసుకున్న అంశాల మధ్య సంబంధాలు, తేడాలు, పోలికలు, వాటికి కారణాలపై ఉదాహరణ సహితంగా పట్టు సాధించాలి.
 • పాఠ్యాంశంపై అవగాహన పెంపొందించుకున్న తర్వాత అందులోని అంశాలను సొంతంగా విశ్లేషించే, వ్యాఖ్యానించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. దీనివల్ల 4 మార్కుల ప్రశ్నలకు తేలిగ్గా సమాధానం రాయొచ్చు.
 • ఏదైనా గ్రాఫ్/ చార్ట్/ పటం/ గణాంకాల పట్టిక ఇచ్చి, దాని ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి సమాచార సేకరణ నైపుణ్యాన్ని పెంపొందించే అంశాలను గుర్తించి, అధ్యయనం చేయాలి.
 • వివిధ అంశాలు ప్రస్తుత సమాజ గతిని మార్చడానికి ఏ విధంగా కారణమవుతున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటిని సొంతంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని అలవరచుకోవాలి.
 • పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు కనిపించే ప్రదేశాలను అట్లాస్‌లో గుర్తించాలి. ఇలాచేస్తే పట నైపుణ్యాలు కింద ఇచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు. తెలంగాణ, భారతదేశ పటాలను గీసే నైపుణ్యాన్ని సాధించాలి.
 • సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు.. వివిధ పాఠాల్లో ఉన్నాయి. వీటిపై అవగాహన పెంపొందిం చుకోవాలి. వాటిపై స్పందించే తీరు సానుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలి.
 • పాఠం చివర ఉన్న ప్రశ్నల ఆధారంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో విద్యా ప్రమాణాల వారీగా రూపొందించుకోవాలి. వాటికి సమాధానాలు రాసి, ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించుకోవాలి.
 • మొదటి భాగంలో భారతదేశం: భౌగోళిక స్వరూపాలు; ఉత్పత్తి- ఉపాధి; భారతదేశ శీతోష్ణస్థితి; భారతదేశ జనాభా, ప్రపంచీకరణ, ఆహార భ్రదత; రెండో భాగంలో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, ఎన్నికల ప్రక్రియ; ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం- భారతదేశం; తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం; రాజకీయ ధోరణుల ఆవిర్భావం ముఖ్యమైన చాప్టర్లు. వీటి నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
 • బార్‌గ్రాఫ్‌లు, పై చార్టులు, లైన్ గ్రాఫ్‌లు, పటాలు, పట్టికలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. మొదటి భాగంలో భారతదేశ భౌగోళిక స్వరూ పాలు చాప్టర్లో ఉన్న ప్రదేశాలను ఇండియా మ్యాప్‌లో గుర్తించడాన్ని ప్రాక్టీస్ చేయాలి. రెండో భాగంలో ప్రపంచ పటంలో గుర్తించాల్సిన ప్రదేశాలపై దృష్టిసారించాలి.
 • తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అతి ముఖ్యమైన చాప్టర్. దీన్నుంచి 6 మార్కులకుపశ్నలు రావొచ్చు.
Published on 11/28/2017 11:50:00 AM
టాగ్లు:
Tenth Class Exam Guidance

Related Topics