బీసీ గురుకులాల్లో 1107 పోస్టులు!


సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ ఉద్యోగ ఖాళీల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పాట్లు చేస్తోంది.
Edu news2019-20 వార్షిక ఏడాదిలో రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించి 1,698 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా..ఆ పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముందుగా బోధన సిబ్బందిని భర్తీ చేయాలని గురుకుల నియామకాల బోర్డు భావిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో బోధన కేటగిరీకి సంబంధించి 1,071 టీజీటీ పోస్టులు, 36 ప్రిన్సిపాల్ పోస్టులున్నాయి. గురుకుల పాఠశాల నిర్వహణలో కీలకమైన ఈ రెండు కేటగిరీలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి భర్తీ చేసేలా గురుకుల బోర్డు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ నెలాఖరు కల్లా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోధనేతర కేటగిరీల్లోని మిగతా పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయనున్నారు.

కొత్త బీసీ గురుకులాలకు మంజూరైన పోస్టులు..
కేటగిరీ పోస్టులు
ప్రిన్సిపాల్స్ 36
టీజీటీ 1,071
పీఈటీ 119
లైబ్రేరియన్ 119
క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ 119
స్టాఫ్ నర్స్ 119
జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్ 110
జూనియర్ అసిస్టెంట్ 5
Published on 10/7/2019 4:46:00 PM
టాగ్లు:
TSEIRB BC Gurukulas PGT and TGT jobs Telangana Residential Educational Institutions Recruitment Board

Practice Papers

Related Topics