జనవరిలో ‘డీఎస్సీ’ నియామకాలు : ఆదిమూలపు సురేష్


మార్కాపురం: డీఎస్సీ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు.
Education Newsవచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలు చేపడతామని వెల్లడించారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చామని, పోస్టులను కూడా క్రమబద్ధీకరించి డీఎస్సీ నియామకాలు చేపడతామన్నారు. సెప్టెంబర్ 14న ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీపీయూఎస్‌ఎంఏ (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తామని, ఇందుకోసం బడ్జెట్‌లో ముఖ్యమంత్రి రూ.6,546 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. విద్య వ్యాపారం కాకూడదనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లోకి వచ్చే నగదు బ్యాంకుల్లో అప్పులకు జమ కాకుండా చేస్తామన్నారు.
Published on 9/16/2019 2:41:00 PM
టాగ్లు:
DSC Recruitment AP Education Minister Adimulapu Suresh APPUSMA Amma vodi Scheme

Practice Papers

Related Topics