గురుకులాల్లో 1,698 ఉద్యోగాల భర్తీకి ఆమోదం


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కొలువుల జాతర మొదలైంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త జోనల్ విధానం ప్రకారం.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల విభజన పూర్తికావడంతో ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతమయ్యాయి.
Edu newsతాజాగా బీసీ గురుకుల పాఠశాలల్లో 1,698 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ జూలై 12నఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఈ పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)కు సమర్పించాలి. అనంతరం గురుకుల నియామకాల బోర్డు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.

కొత్త పాఠశాలల్లోనివే .........
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకిగాను మంజూరు చేసిన పోస్టులన్నీ కొత్త గురుకుల పాఠశాలల్లోనివే. ఈ ఏడాది కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో తొలుత 5, 6, 7 తరగతులను ప్రారంభించారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం... ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కొత్తగా మరిన్ని పోస్టులు మంజురు చేస్తుంది.

కేటగిరీల వారీగా మంజూరైన పోస్టులు :
కేటగిరీ పోస్టులు
ప్రిన్సిపాల్స్ 36
టీజీటీ 1,071
పీఈటీ 119
లైబ్రేరియన్ 119
క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ 119
స్టాఫ్ నర్స్ 119
జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్ 110
జూనియర్ అసిస్టెంట్ 5
Published on 7/13/2019 2:57:00 PM
టాగ్లు:
TS gurukulam schools TS gurukulam schoolsjobs TS BC gurukulam posts telangana government 1698 BC gurukulam jobs TS new zonel system

Practice Papers

Related Topics