టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల


సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్టీ-2017 నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Edu newsస్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.

టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
10-07-2019: జిల్లా వారీగా ఎంపికై న అభ్యర్థుల జాబితా ప్రదర్శన(మీడియం వారీగా) రూల్2,3 ప్రకారం జిల్లా విద్యా శాఖ అధికారులతో ఖాళీల గుర్తింపు కౌన్సెలింగ్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ ద్వారా పత్రికా ప్రకటన జారీ
11-07-2019: రూల్ 2, 3 ప్రకారం వేకెన్సీ జాబితా ఖరారు కోసం జిల్లా స్థాయి కమిటీ సమావేశం మీడియం, కేటగిరీ వారీగా జిల్లాలో వేకెన్సీ పొజిషన్- వెబ్‌సైట్‌లో ప్రకటన టీఆర్టీ-2017 నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన
13-07-2019-14-07-2019: కేటగిరీ వారీగా అపాయింట్‌మెంట్, పోస్టింగ్ ఉత్తర్వుల జారీ కోసం కౌన్సెలింగ్ స్కూల్ అసిస్టెంట్, తెలుగు, ఉర్దూ, మరాఠీ లాంగ్వెజీ పండిట్, పీఈటీలు
15-07-2019: నియామక ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల రిపోర్టింగ్
17-07-2019: రిపోర్టు చేయని వారి జాబితాను డీఈవోలు రూపొందిస్తారు
18-07-2019: రూల్-5 ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక పత్రాల జారీ
19-07-2019:విధుల్లో చేరిన ఉపాధ్యాయుల జాబితాను హెచ్‌ఎంలు, మండల విద్యా శాఖ అధికారులుడీఈవోకు సమర్పించాలి నోటీస్ బోర్డు/ డీఈవో వెబ్‌సైట్‌లో విధులోచేరిన టీచర్ల జాబితా ప్రదర్శన
20-07-2019:నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ వివరాలజాబితా టీఎస్‌పీఎస్సీకి సమర్పణ జిల్లా వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాలవిద్యా శాఖ కమిషనర్‌కు సమర్పణ
Published on 7/9/2019 2:17:00 PM
టాగ్లు:
teacher recruitment test Teacher jobs teacher recruitment test problems TS education department TRT-2017 trt schedule 2017 school assistant posts TRT-2017counselling TRT-2017 counselling schedule TRT-2017 counselling schedule released

Practice Papers

Related Topics