డీఎస్సీ ‘కీ’పై అభ్యంతరాలకు జూలై5తో ఆఖరు


సాక్షి, అమరావతి: ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీ పరీక్ష ‘కీ’పై జూలై5లోపు అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ అభ్యంతరాలను పంపొచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
Edu newsతదనంతరం వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రత్యేక ఉపాధ్యాయ డీఎస్సీ ‘కీ’, రెస్పాన్‌‌స షీట్లను జూలై2 నుంచే ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్‌ఓఓఎల్‌ఈడీయూ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కాగా, భాషా పండితులకు పదోన్నతులను జీవో 11, 12లను అనుసరించి ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలని ఆప్టా రాష్ట్ర శాఖ జాతీయ సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశరావు ఒక ప్రకటనలో కోరారు.
Published on 7/4/2019 6:28:00 PM
టాగ్లు:
DSC Key Education Department Commissioner HTTS Language Pandits

Practice Papers

Related Topics