డీఎస్సీలో విజయానికి వ్యూహాలు...


షెడ్యూల్ వెలువడటం.. దానికి తగ్గట్లు నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. డీఎస్సీ ఔత్సాహికులకు ఇటీవల కాలంలో ఎదురైన పరిస్థితి ఇది. అయితే సమస్యల్ని దాటుకొని ఎట్టకేలకు తాజాగా టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ); టెట్ కమ్ టీఆర్‌టీ ప్రకటనలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, జడ్‌పీపీ, ఎంపీపీ, స్పెషల్, మున్సిపల్, ఆదర్శ తదితర పాఠశాలల్లో మొత్తం 7,729 ఖాళీల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటనలు విడుదల చేసింది. వీటిలో 3,666 ఎస్‌జీటీ, 1625 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఖాళీలు తక్కువ, పోటీ ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర కెరీర్‌ను చేజిక్కించే ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో విజయానికి సూచనలు...
Education Newsఅర్హతలు, పరీక్ష విధానం...
  • స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్, ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నిర్వహిస్తారు.
  • సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి టెట్ కమ్ టీఆర్‌టీ ఉంటుంది. పరీక్షలు ఆన్‌లైన్ విధానం (సీబీటీ)లో జరుగుతాయి.

విద్యార్హతలు :
ఎస్‌జీటీ: ఇంటర్మీడియెట్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)/డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) (లేదా) కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ.
స్కూల్ అసిస్టెంట్: ఆయా సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. ఎస్‌ఏ-లాంగ్వెజెస్, ఎల్‌పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి అకడమిక్, టీచింగ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి.
వయసు: 18-44 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టులు-మార్కుల వెయిటేజీ :
స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ:
మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-80 మార్కులు; ఏపీ టెట్-20 మార్కులు).
స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-50 మార్కులు, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్-30 మార్కులు, ఏపీ టెట్-20 మార్కులు).
మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-70 మార్కులు, స్కిల్ టెస్ట్-30 మార్కులు).
ప్రిన్సిపల్, పీజీటీ, క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ).
ఎస్‌జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్ కమ్ టీఆర్‌టీ).

ఎస్‌జీటీ-టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష విధానం :

 

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

1.

జీకే అండ్ కరెంట్ అఫైర్స్

20

10

2.

విద్యా దృక్పథాలు

10

5

3.

విద్యా మనోవిజ్ఞానశాస్త్రం

20

10

4.

లాంగ్వేజ్-1 (ఆప్షనల్)

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

5.

లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్)

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

6.

మ్యాథమెటిక్స్

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

7.

సైన్స్

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

8.

సోషల్ స్టడీస్

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

 

మొత్తం

200

100

  • పరీక్షకు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్‌, బయాలజీ, సోషల్ స్టడీస్ తదితర) (టీఆర్‌టీ) :

 

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

1.

జీకే అండ్ కరెంట్ అఫైర్స్

20

10

2.

విద్యా దృక్పథాలు

10

5

3.

విద్యా మనోవిజ్ఞానశాస్త్ర

 

 

 

తరగతి గది అన్వయం

10

5

4.

సంబంధిత సబ్జెక్టు

 

 

 

కంటెంట్

80

40

 

మెథడాలజీ

40

20

 

మొత్తం

160

80

  • పరీక్షకు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

సన్నద్ధమవ్వండిలా...
ఎస్‌జీటీ :
జీకే, కరెంట్ అఫైర్స్:
తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. ఆపై సబ్జెక్టుల వారీ వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి.
  • స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు-రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్‌కు పత్రికలను ఉపయోగించుకోవాలి.
    విద్యా దృక్పథాలు: దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం (ఎన్‌సీఎఫ్-2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.
    విద్యా మనోవిజ్ఞానశాస్త్రం: శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన-స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.
    కంటెంట్: తెలుగు (ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమె టిక్స్, సైన్స్, సోషల్‌స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు-కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతో పాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి.
  • గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది.
  • సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు-క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి.
  • సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ-బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం-సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.

మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకంటూ చదవాలి. సొంత నోట్స్ రూపకల్పనతో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
స్కూల్ అసిస్టెంట్ :
  • ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి.
  • బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు-అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలపై దృష్టిసారించాలి.
మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్‌స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించగా బయాలజీలో అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చాయి.

మాక్‌టెస్ట్‌లతో మేలు..
కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు-స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్లో పరీక్షలు జరుగుతాయి కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది.
- జె.సుధాకర్, డెరైక్టర్, ప్రతిభ కోచింగ్ సెంటర్, విజయవాడ.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 1, 2018.
దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 16, 2018.
ఫీజు చెల్లింపు తేదీలు: 2018, నవంబర్ 1-15.

ఆన్‌లైన్ పరీక్ష తేదీలు :
స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్):
2018, డిసెంబర్ 6, 10.
స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్): 2018, డిసెంబర్ 11.
పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్; ఆర్ట్, డ్రాయింగ్ టీచర్: 2018, డిసెంబర్ 17.
పీజీటీ: 2018, డిసెంబర్ 12, 13.
టీజీటీ, ప్రిన్సిపల్: 2018, డిసెంబర్ 14, 26.
ఎస్‌జీటీ: 2018, డిసెంబర్ 28 నుంచి 2019, జనవరి 2 వరకు.
లాంగ్వేజ్ పండిట్స్: 2018, డిసెంబర్ 27.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apdsc.apcfss.in
Published on 10/29/2018 4:55:00 PM
టాగ్లు:
AP DSC- 2018 DSC success plan AP DSC- 2018 notification DSCpreparation tips 7729 Teacher jobs in AP AP DSC- 2018syllabus DSC preparation School assistant posts AP DSC- 2018exam system

Practice Papers

Related Topics