ఏపీ డీఎస్సీ-2018 నోటిఫికేషన్ విడుదల


సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది.
Education Newsప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, మున్సిపల్, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 7,729 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రిక్రూట్‌మెంట్ ఆఫ్ టీచర్స్ (డీఎస్సీ-2018) నోటిఫికేషన్ పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దివ్యాంగులకు, ఇతర కేటగిరీల వారికి ప్రత్యేక పెంపు వర్తింపు ఉంటుంది. డీఎస్సీని ఈసారి ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ఆధారితంగా) రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 4,341 పోస్టులతోపాటు ఆదర్శ పాఠశాలల్లో 909 పోస్టులు, మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి 1,100, గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలల్లో 175, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 404 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 7,729 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 3,666, స్కూల్ అసిస్టెంట్లు 1625 పోస్టులు ఉండగా.. 452 బాషా పండితుల పోస్టులు, 476 పీఈటీ పోస్టులు, 715 టీజీటీ, 583 పీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. 89 ప్రిన్స్ పల్, 22 ఆర్టు పోస్టులు, 25 క్రాఫ్ట్, 76 మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల సమర్పణ ఎప్పుడంటే...
నవంబర్ 1 నుంచి 16 తేదీ వరకు అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును నవంబర్ 1 నుంచి 15వ తేదీల మధ్య చెల్లించాలి. నవంబర్ 29 నుంచి అన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తారు. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ పోస్టులకు రెండున్నర గంటలపాటు.. పీజీటీ, ప్రిన్సిపాల్, మ్యూజిక్, డ్రాయింగ్, ఎస్జీటీ పోస్టులకు మూడు గంటల వ్యవధిపాటు పరీక్ష ఉంటుంది. ఉదయం ఒక విడత, సాయంత్రం రెండో విడత పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం:
  • ఎస్జీటీలకు టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది. 100 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి.
  • స్కూల్ అసిస్టెంట్లకు (అన్ని సబ్జెక్టులకు) 80 మార్కులకు 160 ప్రశ్నలు ఉంటాయి. టెట్‌లోని మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
  • లాంగ్వేజ్ పండిట్లకు 80 మార్కులకు 160 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
  • పీఈటీలకు 50 మార్కులకు 100 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. 30 మార్కులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు ఉంటుంది. టెట్ 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులకు 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు.
  • మ్యూజిక్ పోస్టులకు 70 మార్కులకు పరీక్ష ఉంటుంది. 30 మార్కులకు నైపుణ్య పరీక్ష ఉంటుంది. పైవన్నీ పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల పోస్టులకు సంబంధించిన పరీక్షలు.
  • ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లోని ప్రిన్సిపాళ్ల పోస్టులకు రెండు పేపర్లతో పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్టు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫయింగ్ మార్కులుగా ఓసీ, బీసీలకు 60, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 మార్కులు రావాలి. ఇదే పోస్టులకు పేపర్-2ను 100 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్‌లో క్వాలిఫై అయితేనే రెండో పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
  • పీజీటీలకు ఇంగ్లీషు ప్రొఫిషియెన్సీ టెస్టు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో నిర్ణీత క్వాలిఫై మార్కులను సాధించాలి. మెయిన్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది.
  • టీజీటీలకు పేపర్-1 కింద 100 మార్కులకు ఇంగ్లీషు ప్రొఫిషియెన్సీ టెస్టు ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ టెస్టు. ఇక రెండో పేపర్ 80 మార్కులకు ఉంటుంది. ఈ పోస్టుల అభ్యర్థులకు టెట్‌లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
  • మ్యూజిక్ పోస్టులకు 70 మార్కులకు పరీక్ష ఉంటుంది. 30 మార్కులకు నైపుణ్య పరీక్ష ఉంటుంది.

పరీక్షలు తేదీలు :
స్కూల్ అసిస్టెంట్స్(నాన్ లాంగ్వేజెస్):
డిసెంబరు 6, 10
స్కూల్ అసిస్టెంట్స్(లాంగ్వేజెస్): డిసెంబరు 11
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్: డిసెంబరు 12, 13
గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు ప్రిన్సిపాల్స్: డిసెంబరు 14, 26
పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్సు: డిసెంబరు 17
లాంగ్వేజ్ పండిట్స్: డిసెంబరు 27
సెకండ్ గ్రేడ్ టీచర్లు: డిసెంబరు 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు (ఆరు రోజులు)

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Published on 10/27/2018 12:17:00 PM
టాగ్లు:
AP DSC notification AP DSC- 2018 AP DSC notificationreleased Government teacher posts AP DSC- 2018exam dates AP DSC- 2018applications 7729 Teacher posts notification in AP AP DSC- 2018online exam AP DSC- 2018notification details

Practice Papers

Related Topics