స్కూల్ అసిస్టెంట్ ‘బయాలజీ ’ సన్నద్ధమవండిలా..


DSCస్కూల్ అసిస్టెంట్ -బయలాజికల్ సెన్స్. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో.. మరో కీలక పోస్ట్. పోటీపడే అభ్యర్థుల సంఖ్య సైతం వేలల్లోనే ఉంటుంది. కాబట్టి ఔత్సాహికులు ప్రత్యేక శ్రద్ధతో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా కంటెంట్ పరంగా ప్రతి టాపిక్‌పైనా లోతైన అవగాహన అవసరం. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్‌కు సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు..

పరీక్ష తీరుతెన్నులు...
విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 10
విద్యా దృక్పథాలు 20 10
కంటెంట్ 88 44
టీచింగ్ మెథడాలజీ 32 16
మొత్తం 160 80
సమయం: రెండున్నర గంటలు

టైమ్ మేనేజ్‌మెంట్ :
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు టైమ్ మేనేజ్‌మెంట్ పాటించాలి. ప్రశ్నల సంఖ్య, లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 150 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంటే.. ఒక్కో ప్రశ్నకు లభించే సమయం నిమిషం కంటే తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సమయంలోనే వేగంగా, కచ్చితత్వంతో సమాధానం గుర్తించేలా వ్యవహరించాలి. ఇందుకు ప్రధాన సాధనం.. ప్రాక్టీస్.

విద్యా దృక్పథాలకు..
మొత్తం అయిదు యూనిట్లుగా ఉన్న విద్యా దృక్పథాలకు అభ్యర్థులు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, బాలల హక్కులు, రైట్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్-2009లను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, సక్సెస్ స్కూల్స్.. వాటి ఏర్పాటు, అమలు, ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

కంటెంట్ కసరత్తు..
అభ్యర్థులు కంటెంట్‌ను లోతుగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్ సిలబస్ ఆరు నుంచి పదో తరగతి వరకు అని అంటూనే.. క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి కాస్త ఎక్కువ స్థాయిలోనే ప్రిపేర్ అవడం మంచిది. సిలబస్‌లో మొత్తం తొమ్మిది యూనిట్లను పేర్కొన్నారు. దీనికి సంబంధించి అడిగే ప్రశ్నల సంఖ్య 88. మార్కులు 44. అంటే.. సగటున ఒక్కో యూనిట్ నుంచి 8 లేదా 9 ప్రశ్నలడిగే అవకాశముంది.

పేర్కొన్న యూనిట్లు...
 • బయలాజికల్ సెన్సైస్ -లివింగ్ వరల్డ్ (జీవ ప్రపంచం)
 • మైక్రోబియల్ వరల్డ్ (సూక్ష్మజీవ ప్రపంచం) -సెల్ అండ్ టిష్యూస్(కణం-కణజాలం) -ప్లాంట్ వరల్డ్ (వృక్ష ప్రపంచం)
 • జంతు ప్రపంచం -అవర్ ఎన్విరాన్‌మెంట్(మన పర్యావరణం)
 • వరల్డ్ ఆఫ్ ఎనర్జీ (శక్తి ప్రపంచం)
 • రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ (జీవశాస్త్రంలో తాజా పరిణామాలు)
వివరణాత్మక ప్రిపరేషన్ :
ప్రతి యూనిట్‌కు సంబంధించి.. సిలబస్ పరిధి కొంత ఎక్కువగానే ఉంది. అయితే సిలబస్‌ను నిర్దిష్టంగా పేర్కొనడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో ప్రతి యూనిట్‌లోనూ.. ప్రతి టాపిక్‌పై లోతైన అవగాహన పెంచుకోవాలి. పరీక్ష కోణంలో ముఖ్యమైనది ఏది? కానిది ఏది? అని విశ్లేషించుకుని చదవాలి. ఇందుకోసం గత ప్రశ్న పత్రాల పరిశీలన ఎంతో మేలు చేస్తుంది. ఒక అంశాన్ని చదివేటపు్పుడు చాలా వివరణాత్మకంగా అభ్యసనం చేస్తేనే స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఈ ప్రిపరేషన్ సమయంలోనే ఒక టాపిక్‌కు సంబంధించి స్వయంగా ఎందుకు? ఏమిటి? ఎలా? అనే దృక్పథంతో ముందుకుసాగాలి. దీనికి భిన్నంగా కేవలం పుస్తకంలో ఉన్న వాక్యాలను చదువుకుంటూ వెళితే ప్రయోజనం ఉండదు. కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ, అవర్ ఎన్విరాన్‌మెంట్, పొల్యూషన్ వంటి అంశాల విషయంలో ఇది ప్రయోజనకరం.

ఆరు నుంచి ఇంటర్మీడియెట్ :
ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అకడమిక్ పుస్తకాలకే పరిమితం కావడం మంచిది. ప్రతి యూనిట్‌లోనూ ఆయా టాపిక్స్‌కు సంబంధించి.. ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు పుస్తకాల్లో సదరు అంశానికి కొనసాగింపుగా, అనుసంధానంగా ఉన్న వాటన్నింటినీ క్రోడీకరించుకొని చదవాలి. ఉదాహరణకు.. యానిమల్ వరల్డ్ టాపిక్స్ హైస్కూల్ స్థాయి పుస్తకాలతో పాటు ఇంటర్మీడియెట్‌లోనూ ఉన్నాయి. కాబట్టి హైస్కూల్ పాఠ్య పుస్తకాలకే పరిమితం కావడం సరికాదు. ఇంటర్మీడియెట్ స్థాయిలో వీటికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తే పూర్తి అవగాహన వస్తుంది. బేసిక్స్ కోసం హైస్కూల్ స్థాయిలోని ఆరు, ఏడు తరగతుల పాఠ్య పుస్తకాలను, సంపూర్ణ విశ్లేషణ కోణంలో ఇంటర్మీడియెట్ పుస్తకాలను అభ్యసనం చేయాలి

ముఖ్యమైన టాపిక్స్..
వాస్తవానికి టీఆర్‌టీ వంటి పరీక్షల్లో ముఖ్యమైన టాపిక్స్ అని భావిస్తూ వాటికే పరిమితం కాకూడదు. గత ప్రశ్నపత్రాల్లో ఆయా టాపిక్స్‌కు లభించిన వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని ఎక్కువ వెయిటేజీ అంశాలకు కొంత అధిక సమయం కేటాయించాలి.

ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అంశాలు..
 • లివింగ్ వరల్డ్
 • మైక్రోబియల్ వరల్డ్ (సూక్ష్మజీవ ప్రపంచం)
 • ప్లాంట్ వరల్డ్ (వృక్ష ప్రపంచం)
 • జంతు ప్రపంచం
 • అవర్ ఎన్విరాన్‌మెంట్ (మన పర్యావరణం)
 • రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ (జీవశాస్త్రంలో తాజా పరిణామాలు)
వీటిపై ఫోకస్..
జీవశాస్త్రంలో తాజా పరిణామాల యూనిట్ విషయంలో.. ఇటీవల ప్రాముఖ్యం సంతరించుకున్న నానో టెక్నాలజీ, జీనీ బ్యాంక్, జీనీ థెరపీ, బయో టెక్నాలజీ.
మన పర్యావరణం: సహజ వనరులు-వర్గీకరణ, రెన్యువబుల్, నాన్- రెన్యువబుల్ అండ్ ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, వైల్డ్ లైఫ్-కన్జర్వేషన్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, దేశంలో నేచురల్ పార్క్స్, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్.
జంతు ప్రపంచం: నాడీ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, పోషకాలు, వాటి విధులు, పలు రకాల వ్యాధులు, ఫస్ట్ ఎయిడ్.
వృక్ష ప్రపంచం: పలు రకాల వృక్షాలు, వాటి ప్రాముఖ్యత, రెస్పిరేషన్, విసర్జక వ్యవస్థ, హార్మోన్లు, ప్లాంట్స్-ఆర్థిక ప్రాధాన్యత, పంట తెగుళ్లు- నివారణ పద్ధతులు.
కణం-కణజాలం: కణ నిర్మాణం, వృక్ష కణాలు-జంతు కణాల మధ్య వ్యత్యాసం, మిటోసిస్, మియోసిస్, వృక్ష-జంతు కణాల రకాలు- వాటి పనితీరు.
సూక్ష్మజీవ ప్రపంచం: వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగి-ప్రోటోజోవాన్
జీవ ప్రపంచం: ఇందులో అన్ని అంశాలు ముఖ్యమే.
బయలాజికల్ సెన్సైస్: జీవశాస్త్ర విభాగాలు, ముఖ్యమైన జీవ శాస్త్రవేత్తలు, దేశంలోని ప్రముఖ జీవ శాస్త్ర సంస్థలు.

మెథడాలజీ ప్రిపరేషన్ ఇలా..
అభ్యర్థులు ముందుగా బీఈడీలో చదివిన టాపిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. మొత్తం పది యూనిట్లు ఉన్న బయాలజీ మెథడాలజీలో అన్ని చాప్టర్లపై పూర్తి పట్టు అవసరం. మొదటి రెండు చాప్టర్లపై ప్రత్యేక దృష్టిసారించడం వల్ల కొంత అదనపు ప్రయోజనం కలుగుతుంది. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదవడం లాభిస్తుంది.

మెథడాలజీ-అప్లికేషన్ ఓరియెంటేషన్
 • విజ్ఞాన శాస్త్ర స్వరూపం, స్వభావం.
 • జీవశాస్త్ర అభ్యసన విలువలు- ఉద్దేశాలు.
 • జీవశాస్త్ర అభ్యసనం-లక్ష్యాలు.
 • జీవశాస్త్ర అభ్యసన ఉపయోగాలు-పద్ధతులు.
 • జీవశాస్త్ర అభ్యసన ప్రణాళికలు.
 • సైన్స్ లేబొరేటరీస్.
 • సైన్స్ కరిక్యులం.
 • జీవశాస్త్ర ఉపాధ్యాయుడి లక్షణాలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
రెండేళ్ల బీఈడీ సిలబస్‌ను కూడా..
ప్రస్తుతం టీఆర్‌టీకి సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో.. పాత విధానంలో బీఈడీ (ఒక ఏడాది), కొత్త విధానంలో బీఈడీ (2014 నుంచి రెండేళ్ల వ్యవధికి పెంచిన బీఈడీ) చేసినవారున్నారు. పాత బీఈడీ అభ్యర్థులు.. మెథడాలజీ పరంగా రెండేళ్ల వ్యవధికి పెంచిన బీఈడీ పుస్తకాలను అధ్యయనం చేయడం లాభిస్తుంది. పలు అంశాలను విపులంగా వివరించడమే ఇందుకు కారణం. వీటిని కూడా ఒకసారి పరిశీలించడం వల్ల మరింత లోతైన అవగాహన కలుగుతుంది.

చదివేటప్పుడే షార్ట్ నోట్స్ :
అభ్యర్థులు ఒక టాపిక్‌ను చదివేటప్పుడే షార్ట్ నోట్స్, డయాగ్రమ్స్, ముఖ్య భాగాలను, ఇతర ముఖ్య ప్రాథమిక భావనలను నోట్స్ రూపంలో పొందుపర్చుకోవాలి. దీనివల్ల రివిజన్ సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ విషయంలో డయాగ్రమ్స్, ముఖ్యమైన టాపిక్స్ (ఉదా: వృక్ష శరీర ధర్మ శాస్త్రం, వృక్ష ప్రజననం తదితర అంశాలు).

చదవాల్సిన పుస్తకాలు
1. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అకడమిక్ పుస్తకాలు (కంటెంట్ కోసం)
2. బీఈడీ అకాడమీ పుస్తకాలు (మెథడాలజీ, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోసం)
3. ప్రాక్టీస్ కోసం మోడల్ టెస్ట్ పేపర్లు.
Published on 11/13/2017 5:23:00 PM
టాగ్లు:
School assistant posts Telangana teacher recruitment test Biological science subject GK and current affairs Teaching mythology for School assistant jobs Telangana school assistant exam TS school assistant exam syllabus Ts school assistant exam preparation tips TS school assistant exam subjects

Practice Papers

Related Topics