తెలంగాణలో మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది (2017) మార్చి 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది.
Education Newsతొలుత ఓఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రధాన టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో టైంటేబుల్ ను ఖరారు చేశారు. అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్‌ను విడుదల చేసింది.

ముందుగా ఓఎస్సెస్సీకి..
పరీక్షల టైంటేబుల్‌లో ఈసారి కొన్ని మార్పులు చేశారు. సాధారణంగా ప్రధాన టెన్త్ పరీక్షలను ముందుగా ప్రారంభించి, చివరలో ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలను ముందు నిర్వహించి... తరువాత ప్రధాన టెన్త్ పరీక్షలను నిర్వహించేలా టైంటేబుల్ ఖరారు చేశారు. మార్చి 14 నుంచి 16 వరకు ఓరియంటల్ ఎస్సెస్సీ, ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సుల పరీక్షలు నిర్వహించి... 17వ తేదీ నుంచి ప్రధాన టెన్త్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి. శేషుకుమారి తెలిపారు. ఆబ్జెక్టివ్ పేపర్‌ను పరీక్షలో చివరి అరగంట ముందుగా ఇస్తారని తెలిపారు.

ఇదీ టెన్త్ పరీక్షల టైం టేబుల్:

తేదీ

సబ్జెక్టు

సమయం (ఉదయం)

14-3-2017

ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)

9:30 - 12:45

15-3-2017

ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)

9:30 - 12:45

16-3-2017

ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు (థియరీ)

9:30 - 11:30

17-3-2017

ప్రథమ భాష పేపర్-1

9:30 - 12:15

ప్రథమ భాష-పేపర్-1 (కాంపొజిట్ కోర్సు)

9:30 - 10:45

18-3-2017

ప్రథమ భాష పేపర్-2

9:30 - 12:15

ప్రథమ భాష-పేపర్-2 (కాంపొజిట్ కోర్సు)

9:30 - 12:45

20-3-2017

ద్వితీయ భాష

9:30 - 12:45

21-3-2017

ఇంగ్లిష్ పేపర్-1

9:30 - 12:15

22-3-2017

ఇంగ్లిష్ పేపర్-2

9:30 - 12:15

23-3-2017

గణితం పేపర్-1

9:30 - 12:15

24-3-2017

గణితం పేపర్-2

9:30 - 12:15

25-3-2017

జనరల్ సైన్స్ పేపర్-1

9:30 - 12:15

27-3-2017

జనరల్ సైన్స్ పేపర్-2

9:30 - 12:15

28-3-2017

సోషల్ స్టడీస్ పేపర్-1

9:30 - 12:15

30-3-2017

సోషల్ స్టడీస్ పేపర్-2

9:30 - 12:15


Published on 11/22/2016 11:14:00 AM

సంబంధిత అంశాలు