పది/ఐటీఐ అర్హతతో... ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4805 ఉద్యోగాలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీల్లో 4,805 అపెంట్రీస్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs వివరాలు:
ఐటీఐ పోస్టులు: 3210
నాన్ ఐటీఐ పోస్టులు: 1595
మొత్తం పోస్టుల సంఖ్య: 4,805
అర్హతలు

ఐటీఐ: ఐటీఐ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
నాన్ ఐటీఐ: నాన్ ఐటీఐ పోస్టులకు కనీసం 50శాతం మార్కులతో మాధ్యమిక్ (పదోతరగతి/తత్సమాన) పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్, మ్యాథమెటిక్స్‌లో 40 శాతం మార్కులు తప్పక ఉండాలి.
వయసు:15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు లోబడి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 20, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ofb.gov.in
Published on 11/19/2019 6:13:00 PM

Related Topics