ఎస్‌ఎస్‌సీ మల్ట్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష ప్రిపరేషన్ విధానం


పదో తరగతి విద్యార్హతతో వివిధ రాష్ర్ట, కేంద్రపాలితప్రాంత ప్రభుత్వ విభాగాల్లో ప్రవేశించడానికి చక్కటి అవకాశం ఎస్‌ఎస్‌సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్. ఎటువంటి అనిశ్చితి పరిస్థితుల్లోనైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్ విభాగం) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చులే అనే ధోరణి విడనాడి నిరంతరం సాధన చేయడం వల్ల ప్రభుత్వ కొలువు సులువుగా మీ సొంతమవుతుంది.

ప్రస్తుత పోటీ పరీక్షల తీరులో మార్పు వచ్చింది. అన్నీ పరీక్షల్లోనూ ప్రధానంగా జనరల్ నాలెడ్జ్ లేదా అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లిష్ పరిజ్ఞానం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ పరీక్షను బట్టి ప్రశ్నల కఠినతస్థాయి మారుతుంది. నిరంతర సాధనతో ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే పరీక్షలు, ఇన్సూరెన్స్, ఇంటెల్లిజెన్స్ బ్యూరో, ఎస్‌ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ వంటి దాదాపు 70 శాతం కేంద్ర, రాష్ర్ట స్థాయి పరీక్షలను ఎదుర్కోవచ్చు. ఈ తరుణంలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ గెడైన్స్, స్టడీ మెటీరియల్, పాతప్రశ్నా పత్రాలు మీ కోసం..

నోటిఫికేషన్ వివరాలు..

పోస్టులు:
మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్

విద్యార్హత : పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం

వయోపరిమితి: 18 - 25 సంవత్సరాలు (01.01.2014 నాటికి)

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా

దరఖాస్తు రుసుం: రూ.100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.)
దరఖాస్తు విధానం: అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు ‘‘సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంప్’’ ద్వారా ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో చేసేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి.

దరఖాస్తు సమర్పణ: ప్రింట్ తీసిన లేదా నిర్ణీత ఫార్మాట్‌లో పూర్తి చేసిన దరఖాస్తును తగిన విద్యార్హత పత్రాలు జతచేసి గడువు తేదీ లోగా రీజనల్/సబ్‌రీజనల్ కమీషన్ ఆఫీస్‌కు చేరేలా పంపాలి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది:
13.12.2013

పార్ట్-I రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 11.12.2013

పార్ట్-II రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:
13.12.2013

వెబ్‌సైట్:
sscner.org.in/MTS_Final_Notice%20.pdf

రాత పరీక్ష విధానం:
రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. అవి పేపర్ 1 (ఆబ్జెక్టివ్ విధానం), పేపర్ 2 (డిస్క్రిప్టివ్ విధానం).

పేపర్-1 పరీక్షా విధానం: పేపర్ 1లో 150 బహుళైచ్ఛిక(మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలుంటాయి.
సబ్జెక్టు/విభాగం ప్రశ్నలు గరిష్ట మార్కులు సమయం
జనరల్ ఇంటెల్లిజెన్‌‌స అండ్ రీజనింగ్ 25 25 2 గంటలు
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25 -
జనరల్ ఇంగ్లిష్ 50 50 -
జనరల్ అవేర్‌నెస్ 50 50 -

సిలబస్ / ప్రిపరేషన్‌ప్లాన్:
జనరల్ ఇంటెల్లిజెన్స్:
ఈ విభాగంలో పోలికలు-బేధాలు(similarities and differences), సమస్య సాధన (problem solving), విశ్లేషణ (analysis), జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ,అర్థమెటిక్‌నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇతర ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ విభాగం సులువుగా ఉంటుంది. నిరంతర సాధన, ఎక్కువ మోడల్ పేపర్లు రాయడం చేస్తే ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఇందులో అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని ప్రాథ మిక స్థాయిలో పరీక్షిస్తారు. గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ స్ట్రక్చర్, సిననిమ్స్, అంటోనిమ్స్ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. రోజూ ఒక ఇంగ్లిష్ దినపత్రికను చదువుతూ.. గ్రామర్, వొకాబులరీ, సిననిమ్స్, ఆంటోనిమ్స్ అభివృద్ధి చేసుకోవాలి. పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, ప్రిపొజిషన్స్, ఆర్టికల్స్, ఆక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డెరైక్ట్ అండ్ ఇండెరైక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్స్, క్రియలు, విశేషణాలు వంటి వాటిపై ప్రాథమిక అవగాహన ఉండాలి. ఎక్కువగా ఇంగ్లిష్ పేపర్ చదవడం, వార్తలు, బృంద చర్చలు వినడం వల్ల ప్రిపరేషన్ సులువవుతుంది.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్: ఈ విభాగంలో నంబర్ సిస్టం, కంప్యూటేషన్ ఆన్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ , రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్, మెన్సురేషన్, కాలం-దూరం, కాలం-పని, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. ఎస్‌ఎస్‌సీ పాత ప్రశ్నా పత్రాలు సాధన చేయడం, వీలైనన్ని మోడల్ పేపర్లు రాయడం వల్ల తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.

జనరల్ అవేర్‌నెస్: అభ్యర్థికి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, మార్పులపై అవగాహన, వాటిని సమాజానికి అనువ ర్తించే విధానం వంటి వాటిని పరీక్షిస్తారు. దైనందిన జీవితంలో జరుగుతున్న మార్పులు, వర్తమాన వ్యవహారాలు, భారత్ - ఇతర దేశాలతో సంబంధం, క్రీడలు, అవార్డులు, జియోగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, శాస్త్ర పరిశోధనలు -ఆవిష్కరణలు వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. రోజూ ఏవైనా రెండు దినపత్రికలు(తెలుగు, ఇంగ్లిష్) చదవడం, సాక్షి భవిత, వెబ్‌సైట్‌లో లభించే కరెంట్ ఆఫైర్‌‌సను చదవాలి. తాజా క్రీడలు-విజేతలు, అవి జరిగిన ప్రదేశాలు, బహుమతులు - ఉత్సవాలు, కొత్త ఆవిష్కరణలు, నియామకాలు, సదస్సులు - సమావేశాలు, కొత్త ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి. బృందాలుగా ఏర్పడి వీటిని చర్చించడం వల్ల చాలా కాలం గుర్తుంటాయి.

పేపర్-2 పరీక్షా విధానం:
ఇంగ్లిష్ లేదా ఏదైనా ప్రాంతీయ భాష(8వ షెడ్యూల్‌లో పేర్కొన్న)లో షార్ట్ ఎస్సే లేదా లెటర్ రైటింగ్ ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయించారు. సమయం 30 నిమిషాలు. ఈ పేపర్ కేవలం అర్హత కోసం మాత్రమే. పేపర్ 1లో అర్హత సాధించిన వారికి మాత్రమే పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.

రిఫరెన్స్ బుక్స్:
ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్:
ఎస్ ఎల్ గులాటీ, ఆర్.ఎస్ అగర్వాల్, 6 నుంచి పదో తరగతి వరకు మ్యాథ్‌‌స పుస్తకాలు.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్: దిల్షాన్ పబ్లికేషన్స్

డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ అనాలసిస్: కిరణ్ పబ్లికేషన్స్

నాన్ వెర్బల్ రీజనింగ్ :
ప్రభాత్ జావేద్

వెర్బల్ రీజనింగ్:
ఆర్.ఎస్. అగర్వాల్

ఇంగ్లీష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్:
హరిమోహన్ ప్రసాద్, ఎ.కె. కపూర్

కరెంట్ ఆఫైర్స్:
ఇండియా ఇయర్‌బుక్, మనోరమ ఇయర్ బుక్, ఏవైనా రెండు దిన పత్రికలు (తెలుగు/ఇంగ్లిష్), ఏదైనా ప్రామాణిక కరెంట్ అఫైర్‌‌స మేగజైన్

జనరల్ నాలెడ్జే:
స్టాక్ జీకే కోసం ఏదైనా ప్రామాణిక పుస్తకం, కొన్ని వెబ్‌సైట్‌లు(సాక్షి ఎడ్యుకేషన్)
వీటితో పాటు 6 నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్ , సోషల్ అకడమిక్ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి.
Published on 12/10/2013 5:07:00 PM
టాగ్లు:
SSC Preparation Plan

Related Topics