35,277 ఉద్యోగాల భర్తీకి రైల్వే నోటిఫికేషన్

భారతీయ రైల్వే....వివిధ బోర్డుల పరిధిలోని 35,277 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Education News ఇంటర్, డిగ్రీతో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకొని.. రెండు దశల్లో జరిగే పరీక్షలో ప్రతిభచూపడం ద్వారా రైల్వే కొలువు సొంతం చేసుకోవచ్చు. ప్రారంభం నుంచి ఆకర్షణీయ వేతనంతో ఉజ్వల కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, సిలబస్ విశ్లేషణ..

పోస్టుల వివరాలు..
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టీపీసీ) మొత్తం పోస్టులు: 35,277

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సంఖ్య: 10,628

పోస్టు పేరు

ఖాళీలు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

4319

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్

760

జూనియర్ టైమ్ కీపర్

17

ట్రైన్స్ క్లర్క్

592

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్

4940

 
గ్రాడ్యుయేట్ పోస్టుల సంఖ్య: 24649

పోస్టు పేరు

ఖాళీలు

ట్రాఫిక్ అసిస్టెంట్

88

గూడ్స్ గార్డ్

5748

సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్

5638

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

2873

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

3164

సీనియర్ టైమ్ కీపర్

14

కమర్షియల్ అప్రెంటీస్

259

స్టేషన్ మాస్టర్

6865

అర్హతలు :
 • అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్ లేదా తత్సమానం. వయసు 01.07.2019 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంది.
 • గ్రాయుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ. వయసు 01.07.2019 నాటికి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంది.

దరఖాస్తు విధానం: సంబంధిత రైల్వేబోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.500, రాయితీ వర్తించే వర్గాలకు రూ.250.
 • నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్ వీకర్ సెక్షన్స్) తదితర వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది.

ఎంపిక విధానం :
ఎంపిక ప్రక్రియలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. అవి..
 1. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఫస్ట్ స్టేజ్ సీబీటీ).
 2. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సెకండ్ స్టేజ్ సీబీటీ).
 3. పోస్టులను బట్టి టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.
 4. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్.

మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష :
మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నల చొప్పున ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది.

ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల్లో కోత వేస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొదటి దశ.. వడపోత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశ పరీక్షకు అనుమతిస్తారు.

రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష :
 • తొలిదశ పరీక్షలో అర్హత సాధించిన వారికి రెండో దశ పరీక్ష ఉంటుంది. మొత్తం 120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నల చొప్పున ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు మార్కు కోత వేస్తారు.
 • కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పోస్టులను బట్టి టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తుది ఎంపిక చేస్తారు.

సిలబస్ :
 • కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల్లో ఒకటే సిలబస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 • మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంటరెస్ట్, కాంపౌండ్ ఇంటరెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ తదితర అంశాలు ఉన్నాయి.
 • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్‌షిప్స్, అనలిటికల్ రీజనింగ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్స్, డేటా సఫిషియెన్సీ, స్టేట్‌మెంట్-కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్-కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ తదితర అంశాలుంటాయి.
 • జనరల్ అవేర్‌నెస్: జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య వర్తమాన అంశాలు; క్రీడలు; భారతీయ కళలు-సంస్కృతి; ప్రసిద్ధ కట్టడాలు; జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ (పదో తరగతి స్థాయి వరకు); భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం; భారతదేశ, ప్రపంచ భౌతిక, సాంఘిక, ఆర్థిక భౌగోళిక అంశాలు; భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, పరిపాలన; దేశ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి(అంతరిక్ష, అణుకార్యక్రమంతో సహా); ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్య అంతర్జాతీయ సంస్థలు; పర్యావరణ సమస్యలు; కంప్యూటర్-ప్రాథమిక అంశాలు; భారత రవాణా వ్యవస్థ; భారత ఆర్థిక వ్యవస్థ; ప్రముఖ వ్యక్తులు; ప్రభుత్వ పథకాలు-కార్యక్రమాలు; భారతదేశ వృక్ష, జంతు సంపద; దేశంలోని ముఖ్య సంస్థలు తదితర అంశాలు.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
01.03.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2019.
కంప్యూటర్ ఆధారిత మొదటి దశ పరీక్ష: జూన్-సెప్టెంబర్ (2019)లో జరిగే అవకాశముంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in
Published on 3/4/2019 5:24:00 PM
టాగ్లు:
Indian railway jobs Railway recruitment board RRB jobs notification Non technical popular categories jobs RRB Non technical popular categories posts notification Junior clerk cum typist posts Station master jobs RRB posts exam system RRB jobs exam syllabus

Related Topics