‘పోలీస్’ పోస్టులకు జూన్ 14 నుంచి 22 వరకు వెరిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల బోర్డు నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్) తుది రాతపరీక్షలో అర్హత సాధించిన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 14వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించనుంది.
Edu news రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్ ప్రక్రియ కోసం అభ్యర్థులు హాజరుకావాల్సిన 18 కేంద్రాల వివరాలను జూన్ 9న వెల్లడించింది. ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి హాజరుకావాల్సిన అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్స్‌ను పంపించింది. ఈ లెటర్స్ ‘https://www.trprb.in/’ లో వ్యక్తిగత ఖాతాల్లో జూన్ 12న ఉదయం 8 గంటల నుంచి నుంచి జూన్ 13న రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, ఎడిటింగ్ కోసం దరఖాస్తు చేసిన ఏ-టైప్ అభ్యర్థులకు జూన్ 20, 21 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుంది.

వెరిఫికేషన్ కేంద్రాల వివరాలు..
ఆదిలాబాద్: ఏఆర్ హెడ్‌కార్టర్స్, ఎస్పీ ఆఫీసు, ఆదిలాబాద్; సైబరాబాద్: సీపీ ఆఫీస్, గచ్చిబౌలి, హైదరాబాద్; హైదరాబాద్: మెట్రో బ్యారక్స్, బేగంపేట మెట్రోస్టేషన్ పక్కన, హైదరాబాద్; కరీంనగర్: సీపీ కార్యాలయం, కరీంనగర్; ఖమ్మం: సీపీ కార్యాలయం, ఖమ్మం; కొత్తగూడెం: సీఆర్‌క్లబ్, ప్రకాశం స్టేడియం ఎదురుగా, పోస్టాఫీసు సమీపంలో; మహబూబాబాద్: ఎస్పీ కార్యాలయం, మహబూబాబాద్; మహబూబ్‌నగర్: ఎస్పీ కార్యాలయం, మహబూబ్‌నగర్; నాగర్‌కర్నూల్: ముస్లిం మైనార్టీ కాలేజ్, ఈద్గా వద్ద, సిరిపురం రోడ్డు, నాగర్‌కర్నూల్; నల్లగొండ: ఎస్పీ కార్యాలయం, నల్లగొండ; నిజామాబాద్: సీపీ ఆఫీస్, నిజామాబాద్; రాచకొండ: సీపీ క్యాంప్ ఆఫీస్, ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఎల్బీనగర్; రామగుండం: సీపీ ఆఫీస్, రామగుండం; సంగారెడ్డి: ఎస్పీ ఆఫీస్, సంగారెడ్డి; సిద్దిపేట: టీటీసీ బిల్డింగ్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా, బైపాస్ రోడ్; సూర్యాపేట్: ఎస్పీ ఆఫీస్, వరంగల్; టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ: సీపీ ఆఫీస్ గచ్చిబౌలి, హైదరాబాద్; వరంగల్: సీపీ ఆఫీస్, వరంగల్.

ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి..
1. ఇంటిమేషన్ లెటర్లు అందిన పోలీసు అభ్యర్థులు ప్రకటించిన తేదీల్లో ఉదయం 9 గంటల కల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి.
2. ఎడిటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పత్రం (ట్రాన్సెక్షన్ ఫాం)తో అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించాలి.
3. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు హెవీమోటార్ వెహికల్ లెసైన్స్ను తప్పకుండా తీసుకురావాలి.
4. ఫొటోలు, విద్యార్హత, స్టడీ/బోనఫైడ్, కులం, స్థానికత, ఆధార్, ఏజెన్సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, హోంగార్డు, ఎన్‌సీసీ తదితర సర్టిఫికెట్లు సంబంధిత ఇతర అన్ని పత్రాలు తీసుకురావాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
5. అన్ని ధ్రువీకరణపత్రాలు 2014 జూన్ 2 తరువాత జారీ చేసినవై ఉండాలి.
Published on 6/10/2019 5:04:00 PM
టాగ్లు:
TS Police jobs TSLPRB SI posts Constable jobs TS Police jobscertificate verification

Related Topics