ఏపీకి మరో మూడు కొత్త వైద్య కళాశాలలు

సాక్షి, అమరావతి: సామాన్యులు సైతం వైద్యవిద్యను అభ్యసించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Edu newsఈ మూడు కళాశాలల నిర్మాణం, ప్రవేశాలు 2023 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్ గిరిజన వైద్యకళాశాలతో పాటు గుంటూరు జిల్లా గురజాల, విజయనగరం జిల్లాలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 100 నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో ఒక్కో కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో కళాశాలకు రూ.400 కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు.  

  వైద్య కళాశాలలకు పూర్వ వైభవం :
 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకేదఫాలో 4 మెడికల్ కాలేజీలు నెలకొల్పి అరుదైన రికార్డు సృష్టించారు. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) పేరిట నాలుగు ప్రాంతాల్లో నాలుగు వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, ఆదిలాబాద్, ఒంగోలు, కడప ప్రాంతాల్లో ఒక్కో కళాశాలకు రూ.250 కోట్ల చొప్పున వెచ్చించి ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యకళాశాలల ఏర్పాటుకు నడుం బిగించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిపుత్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో పాడేరులో వైద్యకళాశాల నెలకొల్పాలని నిర్ణయించారు. అలాగే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ప్రజల కోసం గురజాలలో మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా, ఇకపై ఆ సంఖ్య 14కు చేరనుంది. 
 
 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు వివరాలు..

 పాడేరు కళాశాల :
 పునాది ముహూర్తం : 10.09.2019
 గ్రౌండింగ్ వర్క్: 20.02.2020
 పనులు పూర్తి : 20.12.2022
 ఎంసీఐకి దరఖాసు్త : 01.07.2022
 అడ్మిషన్లు : 01.08.2023
 
 విజయనగరం కళాశాల :
 పునాది ముహూర్తం : 10.10.2019
 గ్రౌండింగ్ వర్క్ : 20.03.2020
 పనులు పూర్తి : 20.01.2023
 ఎంసీఐకి దరఖాస్తు : 01.07.2022
 అడ్మిషన్లు : 01.08.2023
 
 గురజాల కళాశాల :
 పునాది ముహూర్తం : 10.01.2020
 గ్రౌండింగ్ వర్క్ : 20.06.2020
 పనులు పూర్తి : 20.04.2023
 ఎంసీఐకి దరఖాస్తు : 01.07.2022
 అడ్మిషన్లు : 01.08.2023
Published on 9/3/2019 4:32:00 PM

Related Topics