మెడికల్ కాలేజీలుగా ఆస్పత్రులు

సాక్షి, హైదరాబాద్: దేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద మొత్తంలో కాలేజీలు, వాటి అనుబంధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి.
Edu newsదీంతో ఇప్పుడున్న జిల్లా దవాఖాన్లకే అనుబంధంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఇంతకుముందే 82 హాస్పిటళ్లను గుర్తించిన కేంద్రం, తాజాగా మరో 75 హాస్పిటళ్లను గుర్తించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. వీటిలో తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం జిల్లా హాస్పిటళ్లను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి, కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు ఈ రెండు హాస్పిటళ్ల కు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు వివరించారు.
Published on 8/12/2019 2:18:00 PM

Related Topics