నేషనల్ ‘సెట్స్’ షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Education Newsవచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి. జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది.

నీట్ ప్రిపరేషన్, గెడైన్స్, ఆన్‌లైన్ టెస్ట్స్, మెటీరియల్..ఇతర సమాచారం కొరకు క్లిక్ చేయండి.

అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి.

ఇవీ జాతీయ, ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు..

పరీక్ష తేదీ

సెట్/ పరీక్ష

06-01-2020 నుంచి 11-1-2020 వరకు

జేఈఈ మెయిన్ (మొదటి విడత)

28-01-2020

సీమాట్-2020

28-01-2020

జీప్యాట్ - 2020

03-04-2020 నుంచి 09-04-2020 వరకు

జేఈఈ మెయిన్ (రెండో విడత)
జేఈఈ ఆధారంగా ఇండియన్ స్కూల్ ఆఫ్‌మైన్స్, దన్‌బాద్ ( www.ismdanbad.ac.in)

12 ఏప్రిల్ నుంచి 20 వరకు

ఎస్‌ఆర్‌ఎంఈఈ (ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ)

13 ఏప్రిల్ నుంచి 19 వరకు

వీఐటీఈఈఈ (వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్)

25-04-2020

ఎన్‌సీహెచ్‌ఎంసీటీ జేఈఈ-2020 (హోటల్ మేనేజ్‌మెంట్)

29, 30 ఏప్రిల్-2020

కేసెట్ (కర్ణాటక)

ఏప్రిల్ మూడో వారంలో

ఒడిశా జేఈఈ (ఓజేఈఈ-2020)

20, 21- ఏప్రిల్-2020

కేఈఏఎం-2020 (కేరళ)

3 మే

నీట్

3 మే

ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్టు (ఏఐఎల్‌ఈటీ)

10-5-2020

క్లాట్ (ఆలిండియా లా)నీట్ ఆధారంగా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీవీఎస్‌సీ, ఏహెచ్ కోర్సులు)

10-05-2020

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (కోల్‌కతా) ఎంట్రెన్స్

17-05-2020

జేఈఈ అడ్వాన్స్ డ్

17-05-2020

ఐఐఎస్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్)

31-05-2020

యూపీఎస్సీ ప్రిలిమ్స్

Published on 12/26/2019 3:12:00 PM

Related Topics