జూన్ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ: తెలంగాణ ఇంటర్ బోర్డు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకు నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డు మే 20న ప్రకటించింది.
Education Newsఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని తెలిపింది. ఇక ప్రాక్టికల్స్ 15వ తేదీ నుంచి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని పేర్కొంది. 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జరగనుందని వెల్లడించింది. 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనున్నట్లు తెలిపింది. కాగా, ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా ఇవే తేదీలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక టైం టేబుల్‌ను జారీ చేయనున్నారు.

పరీక్షల వివరాలు..

తేదీ

ప్రథమ సంవత్సరం

ద్వితీయ సంవత్సరం

07-06-2019

పార్ట్-2 ద్వితీయ భాష పేపర్-1

పార్ట్-2 ద్వితీయభాష పేపర్-2

08-06-2019

పార్ట్-1: ఇంగ్లిష్ పేపర్-1

పార్ట్-1: ఇంగ్లిష్ పేపర్-2

09-06-2019


పార్ట్-3: గణితం పేపర్-1ఏ

పార్ట్-3: గణితం పేపర్-2ఏ

వృక్షశాస్త్రం- పేపర్-1

వృక్షశాస్త్రం పేపర్-2

పౌరశాస్త్రం పేపర్-1

పౌరశాస్త్రం పేపర్-2

సైకాలజీ పేపర్-1

సైకాలజీ పేపర్-2

10-06-2019

గణితం పేపర్-1బీ

గణితం పేపర్-2బీ

జంతుశాస్త్రం-1

జంతుశాస్త్రం-2

చరిత్ర-1

చరిత్ర-2

11-06-2019

భౌతిక శాస్త్రం పేపర్-1

భౌతిక శాస్త్రం పేపర్-2

అర్థశాస్త్రం పేపర్-1

అర్థశాస్త్రం పేపర్-2

క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1

క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2

12-06-2019


రసాయన శాస్త్రం పేపర్-1

రసాయన శాస్త్రం పేపర్-2

కామర్స్ పేపర్-1

కామర్స్ పేపర్-2

సోషియాలజీ పేపర్-1

సోషియాలజీ పేపర్-2

ఫైనార్‌‌ట్స, మ్యూజిక్ పేపర్-1

ఫైనార్‌‌ట్స, మ్యూజిక్ పేపర్-2

13-06-2019



జియాలజీ పేపర్-1

జియాలజీ పేపర్-2

హోంసైన్‌‌స పేపర్-1

హోంసైన్‌‌స పేపర్-2

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2

లాజిక్ పేపర్-1

లాజిక్ పేపర్ -2

బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థుల కోసం)

బ్రిడ్జీ కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థుల కోసం)

14-06-2019

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2

జియోగ్రఫీ పేపర్-1

జియోగ్రఫీ పేపర్-2

Published on 5/21/2019 4:10:00 PM
టాగ్లు:
Board of intermediate Telangana State Inter Advanced Supplementary Time Table Intermediate Vocational courses exams

Related Topics