తెలంగాణలో మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.
Education Newsవచ్చే ఏడాది (2017) మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు.. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది. ప్రథమ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 17వ తేదీ వరకు... ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఇక ‘నైతికత-మానవ విలువల (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్)’ అంశంపై పరీక్షను 2017 జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్షను 31వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపింది. ఇక ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనరల్‌తో పాటు వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ టైం టేబుల్‌ను ఖరారు చేశారు. ద్వితీయ భాషా సబ్జెక్టుతో పరీక్షలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.

ఇంటర్ పరీక్షల టైం టేబుల్:

తేదీ

ప్రథమ సంవత్సరం

తేదీ

ద్వితీయ సంవత్సరం

1-3-2017

ద్వితీయ భాష పేపర్-1

2-3-2017

ద్వితీయ భాష పేపర్-2

3-3-2017

ఇంగ్లిష్ పేపర్-1

4-3-2017

ఇంగ్లిష్ పేపర్-2

6-3-2017

మేథమెటిక్స్ పేపర్-1ఏ

7-3-2017

మేథమెటిక్స్ పేపర్-2ఏ

బోటనీ పేపర్-1

బోటనీ పేపర్-2

సివిక్స్ పేపర్-1

సివిక్స్ పేపర్-2

సైకాలజీ పేపర్-1

సైకాలజీ పేపర్-2

8-3-2017

మేథమెటిక్స్ పేపర్-1బి

9-3-2017

మేథమెటిక్స్ పేపర్-2బి

జువాలజీ పేపర్-1

జువాలజీ పేపర్-2

హిస్టరీ పేపర్-1

హిస్టరీ పేపర్-2

10-3-2017

ఫిజిక్స్ పేపర్-1

11-3-2017

ఫిజిక్స్ పేపర్-2

ఎకనామిక్స్ పేపర్-1

ఎకనామిక్స్ పేపర్-2

క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1

క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2

13-3-2017

కెమిస్ట్రీ పేపర్-1

14-3-2017

కెమిస్ట్రీ పేపర్-2

కామర్స్ పేపర్-1

కామర్స్ పేపర్-2

సోషియాలజీ పేపర్-1

సోషియాలజీ పేపర్-2

ఫైన్ ఆ ర్ట్స్, మ్యూజిక్ పేపర్-1

ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2

15-3-2017

జియాలజీ పేపర్-1

16-3-2017

జియాలజీ పేపర్-2

హోం సెన్సైస్ పేపర్-1

హోం సెన్సైస్ పేపర్-2

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2

లాజిక్ పేపర్-1

లాజిక్ పేపర్-2

బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీవారికి)

బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ వారికి)

17-3-2017

మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1
జాగ్రఫీ పేపర్-1

18-3-2017

మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2
జాగ్రఫీ పేపర్-2

Published on 11/22/2016 11:29:00 AM
టాగ్లు:
Telangana intermediate exam dates announced Board of intermediate education telangana state Inter public exams Intermediate public exams timetable released Inter public exams timings Inter first and second year public exams Inter public exam timetable

Related Topics