మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
Education Newsమే 14 నుంచి మే 22 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మే 29న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మే 30న నిర్వహిస్తామంది.

పరీక్ష ఫీజును 20లోగా చెల్లించాలి
సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 20లోగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉండదన్నారు. ఫస్టి యర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవ చ్చని, సాధారణ పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని చెప్పా రు. ప్రైవేటు విద్యార్థులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని, వారు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్‌కే ఫీజు చెల్లించాలని వివరించారు.

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

తేదీ

ఫస్టియర్

సెకండియర్

14-05-2018

సెకండ్ లాంగ్వేజీ-1

సెకండ్ లాంగ్వేజీ-1

15-05-2018

ఇంగ్లిష్-1

ఇంగ్లిష్-2

16-05-2018

గణితం-1ఏ, బోటనీ-1, సివిక్స్-1, సైకాలజీ-1

గణితం-2ఏ, బోటనీ-2, సివిక్స్-2, సైకాలజీ-2

17-05-2018

గణితం-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1

గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2

18-05-2018

ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి-1

ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజీ-2

19-05-2018

కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1, ఫైన్‌ ఆర్ట్స్1, మ్యూజిక్-1

కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్‌ఆర్ట్స్-2, మ్యూజిక్-2

21-05-2018

జియోలజీ-1, హోమ్‌సై న్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-1, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ)

జియోలజీ-2, హోమ్‌సై న్స్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-2(బైపీసీ)

22-05-2018

మాడ్రన్ లాంగ్వేజీ-1, జియోగ్రఫీ-1

మాడ్రన్ లాంగ్వేజీ-2, జియోగ్రఫీ-2

Published on 4/14/2018 12:31:00 PM
టాగ్లు:
Telangana Inter results ts inter results 2018 ts inter results released ts inter advanced supplementary time table TS inter supplementary exams time table TS inter time table inter supllementary time table 2018

Related Topics