ప్రభుత్వ ఉన్నతాధికారి కావాలనేదే నా కల -గ్రూప్2 సెకండ్ ర్యాంకర్ నరేంద్రరెడ్డి

 • స్టేట్ టాపర్‌గా నిలుస్తాననుకోలేదు
 • సాక్షి భవిత, విద్య మెటీరియల్ చాలా హెల్ప్ అయింది
 • గ్రూప్1కి ఎంపికై డీఎస్పీనవుతా
 • గ్రూప్2 స్టేట్ సెకండ్ ర్యాంకర్ నరేంద్రరెడ్డితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ...
చిన్నప్పటినుంచీ ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా పనిచేయాలని కల. అందుకోసం డిగ్రీ పూర్తై వెంటనే గ్రూప్స్‌పై దృష్టిసారించాను. ఎలాగైనా అనుకున్న లక్ష్యం సాధించాలని పట్టుదలగా శ్రమించాను. రోజుకు 10గంటలకుపైగా చదివాను. కోచింగ్ తీసుకున్నప్పటికీ సొంత ప్రిపరేషన్ అవసరమని భావించి సొంతంగా మెటీరియల్ సిద్ధం చేసుకున్నా. భవిష్యత్తులో గ్రూప్1కు ఎంపికై డీఎస్పీ కావాలనేదే నా లక్ష్యం అంటున్నారు మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన నరేంద్రరెడ్డి జాపా. శుక్రవారం ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్2 మార్కుల్లో స్టేట్ సెకండ్ ర్యాంకర్‌గా (మొత్తం మార్కులు 377. హాల్‌టికెట్ నెంబర్ 22583750) నిలిచారు. ఆయనతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ...

గ్రూప్2లో స్టేట్ సెకండ్ టాపర్‌గా నిలిచారు..ఏమనిపిస్తోంది?
గ్రూప్2లో ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఎప్పటినుంచో కలలుకంటున్నా. అయితే కోచింగ్,సొంత ప్రిపరేషన్ అన్నీ అనుకున్నట్లు జరగడం, పరీక్ష ,ఇంటర్వ్యూ బాగా అటెంప్ట్ చేయడంతో ఎక్కువ మార్కులు సాధిస్తాననే నమ్మకం కలిగింది. అయితే స్టేట్ సెకండ్ ర్యాంకర్, 6వ జోన్‌లో టాపర్‌గా నిలుస్తానని అసలు ఊహించలేదు. ఫలితాలు చూసేసరికి చాలా సంతోషం వేసింది. జీవితంలో మరపురాని రోజు ఇది.

మీ విద్యా,కుటుంబ నేపథ్యం?
మాది మెదక్ జిల్లా సిద్దిపేటలోని లింగారెడ్డి పల్లె. ఇంటర్ వరకు చదువంతా సిద్దిపేటలో జరిగింది. డిగ్రీ హైదరాబాద్‌లో చదివాను. ఫాదర్ ప్రభుత్వపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాంపిటేటివ్‌కు ప్రిపేరవాలని నిర్ణయించుకున్నప్పుడు లక్షలాదిమంది పోటీపడే పరీక్షలో రాణించగలనా? అనే సందేహం నెలకొంది. అయితే ఇంట్లో అంతా ప్రోత్సహించారు. నాన్న వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రిపరేషన్‌లో చాలా సాయపడ్డారు.

గ్రూప్2లో ఏ పోస్టుకు ప్రిఫరెన్స్ ఇచ్చారు?
ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్. జోన్‌టాపర్‌గా రావడంతో కచ్చితంగా ఈ పోస్టు వస్తుంది.

గ్రూప్2కు ఎలా ప్రిపేరయ్యారు? మీ ప్రిపరేషన్ ప్లాన్ వివరిస్తారా?
మొత్తం 3 పేపర్లకు ముందునుంచీ నిర్దుష్ట ప్రణాళిక సిద్ధంచేసుకున్నాను. అందులోభాగంగా అన్ని పేపర్లకు కోచింగ్ తీసుకుంటూనే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రధానంగా మూడోపేపర్ కోసం టెక్ట్స్‌బుక్స్ సాయంతో సొంత నోట్స్ ప్రిపేర్‌చేసుకున్నా. కరెంట్‌అఫైర్స్, జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సాక్షి భవిత, విద్య మెటీరియల్ చాలా ఉపయోగపడ్డాయి. వీటిని క్రమం తప్పకుండా ఫాలో అవడంతో ఈ పేపర్లకు సంబంధించి బాగా స్కోరింగ్ చేయగలిగాను. ఆర్‌సీరెడ్డి కోచింగ్ మెటీరియల్ హెల్ప్ అయింది. అన్ని పేపర్లకు కలిసి సుమారు 300పైగా మార్కులు స్కోర్ చేయగలిగాను.

గ్రూప్2 ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
నా ఇంటర్వ్యూ సుమారు 15 నిమిషాలపాటు జరిగింది. బోర్డులోకి ఎంటర్ కాగానే సభ్యులంతా స్నేహపూర్వకంగా పలకరించారు. ఎలాంటి ఒత్తిడి,కంగారు పడకుండా ఇంటర్వ్యూ వాతావరణాన్ని తేలిక పర్చేందుకు ముందు సులువైన ప్రశ్నలు అడిగారు. బయోడేటా ఆధారంగా కొన్ని ప్రశ్నలు వేశారు. ఆతర్వాత కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయ,అంతర్జాతీయ అంశాలపై కొన్ని ప్రశ్నలు అడిగారు.
 • లోక్‌పాల్‌పై మీ అభిప్రాయం? అన్నా హజారే ఉద్యమం సమర్థనీయమా?కాదా?
 • భారతదేశంలో చిన్న రాష్ట్రాల అవసరం ఎంతవరకు ఉంది?
 • రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం సమర్థనీయమా? కాదా?
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి మీకేం తెలుసు?
 • మీకు నచ్చిన పథకం గురించి చెప్పండి?
 • రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే?
 • 108కు 104కు మధ్య వ్యత్యాసం గురించి వివరిస్తారా?
గ్రూప్2లో పేపర్లవారీగా చదివిన పుస్తకాలు? రోజుకు ఎన్ని గంటలు చదివేవారు?
ఎకానామీ పేపర్‌కు ఆర్‌సీరెడ్డి మెటీరియల్ ఉపయోగపడింది. అదేవిధంగా ఏపీ హిస్టరీ సబ్జెక్టుకు బీఎస్‌ఎల్ హనుమంతరావు పుస్తకం, పాలిటీకి ప్రభాకర్‌రెడ్డి మెటిరీయల్, కష్ణారెడ్డి పుస్తకం మంచి స్కోరింగ్‌కు ఉపయోగపడింది. జనరల్ స్టడీస్ విషయంలో ప్రధానంగా సాక్షి భవిత,విద్య ఉపయోగపడ్డాయి. సాక్షిలో రోజూ వచ్చే టాపిక్స్ బాగా చదివాను. ప్రీవియస్ పేపర్లు సైతం ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని.

గ్రూప్2 కి కోచింగ్ అవసరమా?
అవసరమే. కోచింగ్ వలన అసలు ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాలి? ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే కీలకమైన విషయాలు తెలుస్తాయి. పేపర్లవారీగా సిలబస్ అర్థం చేసుకుని .. ప్రావూణిక పుస్తకాలను చదివితే కోచింగ్ అవసరం లేకుండానే విజయుం సాధించవచ్చు.
Published on 3/30/2012 8:36:00 PM

సంబంధిత అంశాలు