జూన్ 26 నుంచి గ్రూప్-2 వెబ్ ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యత ఆధారంగా జూన్ 26 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Edu newsఅలాగే ఒకసారి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌ మళ్లీ మార్చుకునే అవకాశం ఉండనందున, అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని, వీటి ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూకు హాజరయ్యేలోగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.tspsc.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Tags:
Gropu2 WEb options TPSC Web option Process TSPSC Group-2 interviews Gropu2 WEb options dates
Published on 6/26/2019 2:59:00 PM

Related Topics