గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరయ్యేఅభ్యర్థులకు సూచనలు

సాక్షి, హైదరాబాద్: జూలై 1 నుంచి నిర్వహించనున్న గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాలను ప్రతి సోమవారం ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
Edu newsజూలై 1 నుంచి 6 వరకు జరిగే ఇంటర్వూలకు ఎంపికైన అభ్యర్ధుల హాల్‌టికెట్ నంబర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.

అభ్యర్థులకు మాత్రమే అనుమతి...
గ్రూప్-2 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కొన్ని సూచనలు చేసింది. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12.30కి రిపోర్టు చేయాలని పేర్కొంది. అభ్యర్థులు ఒకరికి మాత్రమే ఆఫీసు లోపలికి అనుమతి ఉంటుందని, గైడ్ చేయడానికి ఆఫీస్ మొదటి అంతస్తులో హెల్ప్ డెస్క్ ఉంటుందని తెలిపింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు బయోమెట్రిక్ అటెండెన్స్‌ ఉంటుందని పేర్కొంది. ఉదయం 9.30 తర్వాత, మధ్యా హ్నం 1 తర్వాత రిపోర్టు చేస్తే ఇంటర్వ్యూకు అనుమతించబోమని తెలిపింది. పీహెచ్ అభ్యర్థులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు సూచించిన సమయం కంటే కొంచెం ముందుగా సెక్యూరిటీ నిబంధనలతో ఆఫీస్‌లోకి అనుమతి ఉంటుం దని పేర్కొంది. ఇంటర్వ్యూకు వచ్చే వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైనప్పటి వివరాలు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఏదైనా ఐడీ ప్రూఫ్ (ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్‌, పాస్‌పోర్టు) వెంట తెచ్చుకోవాలని సూచించింది. అభ్యర్థులు మొబైల్, కాలిక్యులేటర్, పెన్‌డ్రైవ్‌‌స, బ్లూటూత్, పర్సు, నోట్స్, పెన్నులు తదితర వస్తువులు తమ వెంట తీసుకురావద్దని.. వీటిలో ఏవి కనిపించినా సీజ్ చేస్తామని హెచ్చరించింది. టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూలపై వచ్చే పుకార్లను నమ్మవద్దని.. ఒకవేళ వాటిలో నిజం ఉందని అనిపిస్తే విజిలెన్స్‌ సెల్ మెయిల్ ఐడీ (vigilance@tspsc.gov.in)కి ఫిర్యాదు చేయవచ్చని అభ్యర్థులకు సూచించింది.
Tags:
Tspsc Group2 Group2 interviews interview details Tspsc suggestion group2 selected candidates details
Published on 6/25/2019 3:35:00 PM

Related Topics