జూలై 1 నుంచి గ్రూపు-2 ఇంటర్వ్యూలు

సాక్షి, హైదరాబాద్: గ్రూపు-2 ఇంటర్వ్యూలను జూలై 1వ తేదీ నుంచి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.
Education Newsఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తేదీల వారీగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన వారి జాబితాలను వారం వారం ప్రకటిస్తామని, జంబ్లింగ్ పద్ధతిలో అభ్యర్థులను ఖరారు చేస్తామని వెల్లడించింది. 1,032 గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ 2017లో నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-2 మీద దాఖలు చేసిన కేసులపై ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడంతో... టీఎస్‌పీఎస్సీ 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
Tags:
tspsc group 2 interviews tspsc group 2 interviewsdates TSPSC Group-2 posts Group-2 postsnotification Group-2 postsproblems
Published on 6/22/2019 3:42:00 PM

Related Topics